స్టైలిష్‌స్టార్..ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఏ రేంజ్‌లో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీ నీడలోనే హీరోగా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. సినిమా సినిమాకి కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ డిఫరెంట్ వేరియేషన్ చూపిస్తూ, వివిధ పాత్రల్లో నటిస్తూ స్టైలిష్ స్టార్ అనిపించుకున్నాడు. పుష్ప మూవీతో ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా విజయం సాధించడంతో పాటు అందరికి ఐకానిక్ గా మారి ఐకాన్ స్టార్ అయ్యాడు. రాజమౌళితో మూవీస్ చేయకుండా పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న హీరో ఎవరంటే బన్నీ అని చెప్పాలి. ఇప్పుడు బన్నీ చేస్తోన్న పుష్ప 2పై దేశ వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయ్యి ఉంది. అల్లు అర్జున్ హీరోగా చేసిన మొదటి సినిమా గంగోత్రి. స్టార్ మేకర్ రాఘవేంద్రరావు 100వ సినిమాగా ఇది తెరకెక్కింది. గంగోత్రి సినిమాతో నటన పరంగా బన్నీ ప్రశంసలు సొంతం చేసుకున్న లుక్స్ పరంగా మాత్రం చాలా విమర్శలే ఎదుర్కొన్నాడు. ఆ సినిమా ఆడియో ఫంక్షన్ ని అల్లు అర్జున్ ని బ్లెస్ చేయడానికి టాలీవుడ్ స్టార్ హీరోలు రావడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, మంచు మోహన్ బాబు, నందమూరి ఫ్యామిలీ నుంచి హరికృష్ణ, ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు, మురళీ మోహన్ లాంటి స్టార్స్ వచ్చారు. అలాగే మలయాళీ స్టార్ యాక్టర్ నెపోలియన్ కూడా గంగోత్రి ఆడియో ఫంక్షన్ కి రావడం విశేషం. ఇండస్ట్రీలోని ఎక్కువ మంది స్టార్స్ పార్టిసిపేట్ చేసిన ఆడియో ఫంక్షన్ గా ఇప్పటికి గంగోత్రి నిలిచిపోతుంది. ఇక అల్లు అర్జున్ ని ఆశీర్వదించడానికి అంత మంది రావడానికి ఇంకో కారణం కూడా ఉంది. అక్కడ ఉన్న హీరోలతో సినిమాలు చేసి సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శక దిగ్గజం రాఘవేంద్రరావు 100వ సినిమాగా గంగోత్రి తెరకెక్కడం. అలాగే అల్లు అరవింద్ కొడుకుగా బన్నీ పరిచయం అవ్వడం కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. ఇంత మంది హీరోల సపోర్ట్ దొరికిన అల్లు అర్జున్ ఈ రోజు ఇండియా మొత్తం తన గురించి చర్చించుకునే స్థాయికి వెళ్లడం నిజంగా గొప్ప విషయం.