Mahanaadu-Logo-PNG-Large

అంబానీ పెళ్లిలో జాన్వీ బాయ్‌ఫ్రెండ్‌?

అంబానీ కొడుకు అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీవెడ్డింగ్‌ ఉత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. మరి ఈ పెళ్లిలో సందడి చేయని వారు లేరు అన్నట్టు ఇటు రాజకీయ ప్రముఖులు.. సినీ ప్రముఖులు అందరూ కూడా ఈ వివాహవేడుకకు హాజరై ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇక శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు, జూ.అతిలోక సుంద‌రి జాన్వీ క‌పూర్ సంద‌డి బోలెడంత చ‌ర్చ‌కు తెర‌తీసింది. జాన్వీ క‌పూర్ త‌న సోద‌రి ఖుషీ క‌పూర్ తో క‌లిసి ఈ వేడుక‌ల్లో సంద‌డి చేసింది. అయితే జాన్వీక‌పూర్ తో పాటు త‌న బోయ్ ఫ్రెండ్ శిఖ‌ర్ ప‌హారియా కూడా ఈ ఫంక్షన్‌లో సందడి చేశారు. ఇక ప్రస్తుతం సోషల్‌ మీడియా అంతటా ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. అంబానీల పెళ్లి వేడుక ఆద్యంతం జాన్వీ క‌పూర్ త‌న స్నేహితుడు శిఖ‌ర్ తోనే క‌నిపించింది. ఓసారి త‌న సోద‌రుడు అర్జున్ క‌పూర్ తో పాటు దిగిన ఫోటోలో కూడా శిఖ‌ర్ క‌నిపించారు. జాన్వీ చెంతే నిలుచుని అత‌డు ఫోజులిచ్చాడు. అలాగే క‌త్రిన‌తో పాటు దిగిన వేరొక పోటోలో జాన్వీతో పాటు శిఖ‌ర్ ఉన్నాడు. ఇంత‌లోనే ఇప్పుడు అంబానీల ఆలయ వేడుకలకు తన సోదరి ఖుషీతో క‌లిసి విచ్చేసిన జాన్వీ క‌పూర్ వెంటే శిఖర్ పహారియా కూడా ఉన్నాడు. ఈ ఉత్స‌వంలో జాన్వి చీర‌లో ఎంతో అందంగా కనిపిస్తోంది. త‌న‌తో పాటు ఖుషీ కూడా హాఫ్ శారీలో ముగ్ధ మ‌నోహ‌ర రూపంతో ఆక‌ట్టుకుంది. శిఖ‌ర్ ట్రెడిష‌న‌ల్ దోతీ కుర్తాలో స్మార్ట్ గా క‌నిపించాడు. జాన్వీ-శిఖ‌ర్ ఒక‌రికొక‌రు ఎంతో స‌న్నిహితంగా క‌నిపించ‌డ‌మే గాక‌.. మాట్లాడుకుంటూ వెళుతున్న వీడియోలు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. శిఖర్ పహారియా- జాన్వీ కపూర్ ప్రేమలో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ ఇద్ద‌రు ప‌లు సందర్భాలలో కలిసి కనిపించారు. ఇటీవల ఖుషీ కపూర్ పుట్టినరోజు వేడుకకు కూడా జంట‌గా హాజరయ్యారు. అలాగే మాల్దీవులలో విహారయాత్రను ఆస్వాధించిన ఫోటోలు వీడియోలు వైర‌ల్ అయ్యాయి. జాన్వీకి అత‌డు కేవ‌లం స్నేహితుడు మాత్ర‌మేనా? అంత‌కుమించి ఇంకేదైనా జ‌రుగుతోందా? అన్న‌ది ప్రస్తుతం నిరంత‌ర చ‌ర్చ‌గా మారింది.