బాలీవుడ్ లో మాన్ సినిమాతో 1999 లో అడుగు పెట్టిన షామా సికిందర్ ఫస్ట్ మూవీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయితే బుల్లి తెర ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. నటిగా మోడల్ గా సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న షామా నాలుగు పదుల వయసులో కూడా అందంతో యంగ్ హీరోయిన్స్ కి పోటీని ఇస్తుంది. సినిమాలు తక్కువే అయినా కూడా సోషల్ మీడియా ద్వారా ఈమె షేర్ చేసే ఫోటోలు మరియు వీడియోలు రెగ్యులర్ గా ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తూనే ఉన్నాయి. ఈ రేంజ్ అందాల ఆరబోత చేస్తున్న షామా సికిందర్ స్టార్ హీరోలకు జోడీగా నటించే స్థాయి అందం కలిగి ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా మరోసారి క్లీ వేజ్ షో తో అందాల షామా సికిందర్ సర్‌ప్రైజ్ చేసింది. ఆకట్టుకునే షామా అందం ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సర్‌ప్రైజింగ్ గానే ఉందని నెటిజన్స్ ఈ ఫోటోల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలాంటి ఫోటోలు షేర్ చేస్తూ ఉన్నా సినిమా ఆఫర్లు ఎందుకు తలుపు తట్టడం లేదు అంటూ కొందరు అంటున్నారు.