స్వీట్ కోరిక తీరబోతుందా.. అది కూడా ఇన్నేళ్ళ తరువా అంటే అవుననే చెప్పాలి. అనుష్క టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరితో పనిచేసింది. చిరంజీవి.. నాగార్జున.. వెంకేటష్… మహేష్ ఇలా స్టార్స్ అందరితోనూ పనిచేసింది. కానీ తన డ్రీమ్ హీరో పవన్ కళ్యాణ్ తో మాత్రం ఇంతవరకూ అవకాశం రాలేదు. నటిగా అనేళ్ల పాటు ఇండస్ట్రీలో ఉన్నా? ఎందుకనో ఆ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. ఈ విషయాన్ని అనుష్క ఓపెన్ గానే ఒప్పుకుంది. పవన్ కళ్యాణ్ తో నటించే ఛాన్స్ రాలేదని….ఆ ఛాన్స్ ఆలస్యమయ్యే సరికి మరింత ఎగ్జైట్ మెంట్ పెరిగిపోతుందని.. తెలిసిన వారు ఎవరైనా పవన్ కళ్యాణ్ కి రికమండ్ చేయమని కూడా అడిగింది. ఆ రిక్వెస్ట్ చేసి కొన్ని సంవత్సరాలు అవుతుంది. బాహుబలి రిలీజ్ అయిన తర్వాత అలా చెప్పుకొచ్చింది. అయినా ఇంతవరకూ పనవ్వలేదు. మరి ఇప్పుడా సమయం ఆసన్నమైందా? పవన్ కళ్యాణ్ కి రికమండ్ చేసే నిర్మాత దొరికాడా? అంటే అవుననే వినిపిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -అల్లు అరవింద్ కాంబినేషన్ లో మరో సినిమాకి రంగం సిద్దమవుతున్నట్లు సమాచారం. ఎన్నికలు అనంతరం ఈ ద్వయం కలిసి ఓ భారీప్రాజెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారుట. ఇందులో హీరోయిన్ గా అనుష్కని దించాలనే ఆలోచనలో ఉన్నట్లు లీకులందుతున్నాయి. స్వయంగా ఛాన్స్ కావాలని అనుష్కనే కోరింది కాబట్టి ఇప్పుడా ఛాన్స్ అరవింద్ తీసుకుంటున్నారనే వార్త ప్రచారంలోకి వస్తోంది. మరి ఇప్పటికిప్పుడు ఈ కాంబినేషన్ ఏ కారణంగా తెరపైకి వస్తుంది? అంటే అరవింద్ వద్ద పవన్ కళ్యాణ్ కొంత మొత్తంలో అడ్వాన్స్ తీసుకున్నట్లు గుస గుస వినిపిస్తుంది. అందుకు ప్రతిగానే పవన్ తో అరవింద్ తో సినిమా ఒప్పందం చేసుకున్నట్లు ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది. దర్శకుడిగా త్రివిక్రమ్ పేరు కూడా తెరపైకి వస్తుంది.