AP Govt: తొలి రోజే కొడాలి నానికి షాక్

గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. కొడాలి నాని నివాసం వద్దనున్న భద్రత సిబ్బందితోపాటు ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బందిని తొలగించారు. ఈ మేరకు గురువారం ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
AP Govt: తొలి రోజే కొడాలి నానికి షాక్
Ex MLA Kodali Nani
గుడివాడ, జూన్ 13: గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. కొడాలి నాని నివాసం వద్దనున్న భద్రత సిబ్బందితోపాటు ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బందిని తొలగించారు. ఈ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో కొడాలి నాని ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే 2004 నుంచి వరుసగా నాలుగుసార్లు కొడాలి నాని గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. కానీ 2009 ఎన్నికల అనంతరం కొడాలి నాని.. టీడీపీకి రాజీనామా చేసి.. వైసీపీలో చేరారు.