రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అచ్చెన్నాయుడు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. వారి మాటల్లో –
రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. తెలుగు ప్రజలు సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతి పండుగ ప్రతీ కుటుంబంలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నాను. కళకళలాడే ముంగిట రంగవల్లులు, బసవన్నల ఆటపాటలు, మనకే సొంతమైన ఆచారాలు మీకు సంతోషాన్ని పంచాలి. పేదలందరికీ పండుగలను దూరం చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. రైతులు అన్ని విధాల నష్టపోయారు. చంద్రబాబు గారి హయాంలో సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ కానుకలు అందించి ప్రతీ ఇంట వెలుగులు నింపాం. నేడు జగన్ రెడ్డి అన్నింటినీ రద్దు చేశారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. ప్రభుత్వం వచ్చిన వెంటనే పండుగ కానుకలు  పునరుద్దరిస్తాం.