ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎమోషన్స్ ఉన్న “లవ్ గురు”

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “లవ్ గురు”. ఆయన తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటిస్తున్న చిత్రమిది. “లవ్ గురు” సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మించారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా “లవ్ గురు” సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 11న విడుదల చేయబోతున్నారు. ఇవాళ “లవ్ గురు” సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా… హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ – మైత్రీ మూవీ వారితో అసోసియేట్ కావాలనేది నా డ్రీమ్. లవ్ గురుతో ఆ కల నిజమైనందుకు సంతోషంగా ఉంది. వాళ్లు మంచి సినిమాను ఇష్టపడతారు. బిజినెస్ యాంగిల్ లోనే చూడరు. మైత్రీ సంస్థతో మరిన్ని మూవీస్ కు కలిసి పనిచేయాలని కోరుకుంటున్నా. లవ్ గురు కథ విన్నాక ఇది నా కెరీర్ లో బిచ్చగాడు తర్వాత అంత పెద్ద హిట్ అవుతుందని దర్శకుడు వినాయక్ కు చెప్పాను. అది నిజం కాబోతున్నందుకు సంతోషంగా ఉంది. వినాయక్ తప్పకుండా పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఈ సినిమాను హిందీలో నీ డైరెక్షన్ లోనే చేస్తాను. ఆ ప్రాజెక్ట్ కు మైత్రీ వాళ్లు కూడా కొలాబ్రేట్ అవుతారని కోరుకుంటున్నా. మృణాళిని మంచి యాక్ట్రెస్. లవ్ గురులో తన పర్ ఫార్మెన్స్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు ఆమెకు నేషనల్ అవార్డ్ వస్తుందని చెప్పగలను. అంత బాగా యాక్ట్ చేసింది. భరత్ మ్యూజిక్ ఈ మూవీకి ఆకర్షణగా నిలుస్తుంది. ఏప్రిల్ 11న మీ ఫ్యామిలీ తో కలిసి లవ్ గురు సినిమాకు రావాలని కోరుకుంటున్నా అన్నారు.