Mahanaadu-Logo-PNG-Large

బాలయ్య బాబోయ్‌ తట్టుకోగలమా?

బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ భారీ మాస్ మసాలా సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రేంజ్ మసాలా ఎలిమెంట్స్ తో ఈ సినిమా ను రూపొందిస్తున్నాడు. ఇక ఊర్వశి రౌటేలా ఒక హీరోయిన్‌ గా నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. బాలయ్య ఈ సినిమాలో డబుల్‌ రోల్‌ కనుక మరో హీరోయిన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్‌ కు చెందిన ఒక యంగ్‌ హీరో ఈ సినిమాలో కీలకమైన నెగటివ్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకో ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ పాత్రకు తమ్ముడి పాత్రలో సదరు యంగ్‌ హీరో కనిపించబోతున్నాడని యూనిట్‌ సభ్యుల ద్వారా ఆఫ్‌ ది రికార్డ్‌ సమాచారం అందుతోంది. ఇప్పటికే చాలా సర్ ప్రైజ్ లు ప్లాన్ చేసిన బాబీ ఇప్పుడు యంగ్ హీరో అంటున్నాడు. దాంతో ఇన్ని సర్ ప్రైజ్ లను తట్టుకోగలమా బాబీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. బాలయ్య బ్యాక్ టు బ్యాక్‌ అఖండ, వీర సింహారెడ్డి మరియు భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు బాబీ సినిమాతో బాలయ్య మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటూ ఫ్యాన్స్ చాలా నమ్మకంతో కనిపిస్తున్నారు.