యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ భారతీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతుంది. జూన్ 1న చెన్నైలో సినీ ప్రముఖులు సమక్షంలో ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నారు.
1996లో కమల్ మాసన్, శంకర్ కాంబినేషన్ విడుదలై బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ‘ భారతీయుడు 2’ రూపొందుతోంది. అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తోన్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో వేగం పుంజుకున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన ఇండియన్ 2 ఇంట్రో వీడియోతో పాటు రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘శౌర..’ అనే పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో బుధవారం మేకర్స్ ‘చెంగల్వ చేయందేనా..’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. అనిరుద్ రవిచందర్ సంగీత సారథ్యంలో రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను అబ్బి, శ్రుతికా సముద్రాల పాడారు.
కమల్ హాసన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె.సూర్య, బాబీ సింహ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.శ్రీకర ప్రసాద్ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్‌గా టి.ముత్తురాజ్ గా వర్క్ చేస్తున్నారు. బి.జయమోహన్, కబిలన్ వైరముత్తు, లక్ష్మీ శరవణకుమార్‌లతో కలిసి డైరెక్టర్ శంకర్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ ఈ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ‘భారతీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. సోనీ మ్యూజిక్ ద్వారా ‘భారతీయుడు 2’ పాటలు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి.