రాష్ట్ర ప్రజల కు బిజెపి భోగి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజల కు బిజెపి భోగి శుభాకాంక్షలు
విజయవాడ : బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద భారీ ఎత్తున భోగి మంటలు కార్యక్రమం నిర్వహించారు.
రాష్ట్ర కార్యాలయం లో నిర్వహించిన వేడుకల్లో బిజెపి సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, బిజెపి గుంటూరు ఇంఛార్జి ఉప్పలపాటి శ్రీ నివాస్ రాజు, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం, రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి పాలూరి శ్రీ నివాస్ తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా కారంచేడు లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు  దగ్గుబాటి పురంధేశ్వరి భోగి వేడుకలు నిర్వహించారు.కుటుంబ సభ్యులు సమక్షంలో ఈ వేడుకలు కొనసాగాయి.
అదేవిధంగా ఈరోజు స్వచ్చ అభియాన్ కార్యక్రమం లో భాగంగా దేవాలయాలు పరిశుభ్రత కార్యక్రమం లో బిజెపి శ్రేణులు పాల్గొన్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు  దగ్గుబాటి పురంధేశ్వరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.