లిఫ్ట్ పేరుతో బ్లాక్మెయిల్ చేస్తున్న ఖీ”లేడి”!!

వెరైటీ మోసానికి ఒక మాయలేడీ తెరలేపింది. వాహణదారులను లిఫ్ట్ అడిగి, కొద్దిదూరం వెళ్ళాక తనను డ్రైవరు మానభంగం చేశాడని, పోలీస్ కంప్లయింట్ ఇస్తానని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసే పని పెట్టుకుంది. జూబ్లీహిల్స్ లో వాహణదారులను బుట్టలో వేసుకునే పనిలో ఉన్న సయీమా సుల్తానా ను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులకు వచ్చిన కంప్లయింట్స్ ప్రకారం, సయీమ రోడ్డు మీద లిఫ్ట్ అడుగుతూ, చాలా తొందరగా వెళ్ళాలి, దయచేసి హెల్ప్ చేయండి అని అడిగి వెళ్తూ, దారిలో తన బట్టలు తానే చింపేసుకొని డ్రైవరు మానభంగం చేశాడని ఆరోపించి డబ్బులు కాజేసే పనిలో ఉంటుంది అని తెలిపారు.