టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిసిన బూరగడ్డ

పెడన: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాజీ డిప్యూటీ స్పీకర్ టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు పెడన నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ బూరగడ్డ కిషన్ తేజ్ మంగళవారం నాడు హైదరాబాదులో కలిశారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బెయిల్ వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది.అలాగే జిల్లాలు నియోజకవర్గ వారీగా తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలు గురించి విపులంగా నారా లోకేష్ తో చర్చించడం జరిగినది.