విజయవాడలో కార్డియాలజిస్ట్ గుండె పోటుతో మృతి…

రమేష్ ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగంలో పనిచేసే వైద్యుడు శ్రీనివాస్ ప్రసాద్ మృతి చెందారు. . సుదీర్ఘ కాలంగా రమేష్ ఆస్పత్రి లో వైద్యులు గా పని చేస్తున్న దంపతులు, గత రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చారు. సదరు డాక్టర్ నిద్ర పోయే ముందు వాటర్ తెచ్చుకోవడానికి వెళ్లి కుప్పకూలి పోయా రు. భర్త ఎంతకు లోపలకు రాక పోవడంతో బయటకు వెళ్లి చూసిన భార్యకు, అపస్మారక స్థితిలో ఉన్న భర్తను చూసి వెంటనే CPR చేశారు. అప్పటికే వైద్యుడు మృతి చెందడంతో షాక్ కు గురయ్యారు. శ్రీనివాస్ ప్రసాద్ దంపతులు కొవిద్ కు ముందు వరకు గాంధీ నగర్ లో కార్డియాక్ క్లినిక్ నడిపేవారు.