కాళి పేరుతో రూపొందిస్తున్న డాక్యుమెంటరీ ఫిల్మ్ లో కాళికామాత సిగరెట్ తాగుతున్నట్టుగా పోస్టర్ రిలీజ్ చేయటంతో తాజా వివాదం తలెత్తింది.ఈ పోస్టర్‌కు డైరెక్టర్‌ను బాధ్యురాలని చేసి అరెస్ట్ చేయాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డాక్యుమెంటరీకి నిర్మాత, దర్శకురాలు లీనా మణిమెకలై. కాళికామాత ఒక చేతితో సిగరెట్ తాగడం, మరోచేతిలో ఎల్జీబీటీలకు సంబంధించిన జెండాను పట్టుకోవడం రెండూ వివాదం అవుతున్నాయి. హిందూ దేవతను ఇంత దారుణంగా కించపరుస్తారా? అంటూ హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పోస్టర్ పై దర్శకురాలు లీనా వివరణ ఇస్తూ… సమానహక్కుల కోసం ఈ డాక్యుమెంటరీని తీసినట్టు తెలిపారు. వాక్స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్దమేనని లీనా అంటున్నారు. కెనడా ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు.