సిబిఎన్ ఫోరం ఆధ్వర్యంలో ద్వారకాతిరుమలలో ప్రత్యేక పూజలు

సిబిఎన్ ఫోరం ఆధ్వర్యంలో ద్వారకాతిరుమలలో ప్రత్యేక పూజలు
CBN ఫోరం ఆధ్వర్యంలో ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు, CBN ఫోరం ప్రెసిడెంట్ సుమిత పాతూరి, వైస్ ప్రెసిడెంట్ సుమన్ వాసిరెడ్డి, ఫోరం టీం సభ్యులు ప్రసన్న మరియు హరీష్ పాల్గొన్నారు.
2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి విజయాన్ని కాంక్షిస్తూ CBN ఫోరం టీం సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించటం చాలా సంతోషకరమని మాజీ ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు తెలిపారు.
 CBN ఫోరం ప్రెసిడెంట్ సుమిత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్  ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉందని, భావితరాల భవిష్యత్తు కోసం మేము అందరం కలిసి వెంకన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి గెలుపు నల్లేరు మీద నడక అని సుమిత తెలిపారు.