కేంద్రం రైల్వే ప్రాజెక్టులు ఇస్తే జగన్ రాష్ట్ర వాటా ఇవ్వడం లేదు – బిజెపి అధికార ప్రతినిధి లంకా దినకర్

– కేంద్రం రైల్వే ప్రాజెక్టులు ఇస్తే జగన్ రాష్ట్ర వాటా ఇవ్వడం లేదు
– రైల్వే ప్రాజెక్టుల ఆలస్యం జగన్మోహన్ రెడ్డి దే
– రాష్ట్రంలో పాలకులు తీరు  ఆంధ్రప్రదేశ్ రైల్వే మరియు జాతీయ రహదారుల ప్రాజెక్టుల పాలిట శాపం ”  అనే అంశం పై   బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్   
రైల్వే :
ఈమధ్య పార్లమెంట్ లో కేంద్రమంత్రి రావ్ఇంద్రజిత్ సింగ్ ప్రకటించిన విధంగా ఏపీలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం 42% పైగా  పెరగడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం.
రాష్ట్ర ప్రభుత్వ భాద్యతారాహిత్య  సహకార లోపం వల్ల దాదాపు ౩౦ ప్రాజెక్టుల వ్యయం దాదాపు 58  వేల కోట్ల రూపాయిల మేరకు అదనపు భారం కేంద్రం పైన పడింది.
నడికుడి–శ్రీకాళహస్తి:
నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైన్‌ రూ.2,289 కోట్లతో  309 కిలోమీటర్ల నిడివి కలిగిన ప్రాజెక్టు రాష్ట్రప్రభుత్వం అవసరమైన భూమి మరియు ప్రాజెక్టు  వ్యయంలో 50 శాతం భరించాల్సి ఉండగా – కేంద్ర ప్రభుత్వం విడుదల  చేసే  నిధులతో సరిపడ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను అందించడంలో జాప్యం చేయడం వల్ల ప్రాజెక్టు వ్యయం అసాధారణంగా పెరిగిపోయింది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టు  ” పిడుగురాళ్ల నుండి శావల్యాపురం మధ్య 46 కి.మీల వరకు సెక్షన్ విద్యుదీకరణతో సహా పూర్తయింది.
కోటిపల్లి–నర్సాపూర్ :
కోటిపల్లి–నర్సాపూర్ కొత్త లైన్ ప్రాజెక్టుకు రూ.2,120 కోట్లతో 57 కిలోమీటర్ల మేర 2000-01లో ప్రాజెక్టు మంజూరైంది.
ప్రాజెక్టు వ్యయంలో 75 శాతం కేంద్రప్రభుత్వం మరియు  25 శాతం రాష్ట్రప్రభుత్వం  భరించాలి.
ఈ విభాగంలోని కొత్త లైన్ పనులలో గౌతమి, వైనతేయ మరియు వశిష్ట నదులపై ప్రధాన వంతెనల నిర్మాణం పురోగతిలో ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వ నిధులతో సరిపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను అందించడంలో జాప్యం చేస్తున్నందున ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతుంది.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్:
ముదరవలస వద్ద రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణం కోసం  ఎంపిక చేసిన స్థలం రైల్వే శాఖకు బదిలీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నది.
జోనల్ ప్రధాన కార్యాలయానికి అవసరమైన కొత్త భవనాల నిర్మాణం, శాశ్వత భవనాల నిర్మాణం కోసం 52.20 ఎకరాల   రెవిన్యూ   భూమి అవసరం.
భూమి  బదిలీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం వల్ల  ప్రస్తుతం  డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం నుండి జోన్ కార్యకలాపాలను  తాత్కాలికంగా ప్రారంభించనివ్వండి” అని 2023 – 24 బడ్జెట్‌లో రూ. 10 కోట్లు  కేంద్ర ప్రభుత్వం కేటాయించిందంటే విశాఖ రైల్వే జోన్ కోసం  కేంద్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధి చాటుకుంది.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు నిధులు అడ్డంకి కాదు, ముదరవలస  వద్ద అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయకపోవడమే ప్రధానమైన ఇబ్బంది.
ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లోని వాల్తేరు  డివిజన్‌కు వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం 2023-24 సంవత్సరానికి  రికార్డు స్థాయిలో రూ.2857.85 కోట్లు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే  మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మరియు భద్రత  కోసం సగటున వార్షిక బడ్జెట్ కేటాయింపులు నాటి కాంగ్రెస్ నేతృత్వంలోకిని యూపీఏ పాలనలో  2009-14లో రూ.886 కోట్ల మాత్రమే.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనలో   2014-19లో రూ.2,830 కోట్లకు మరియు గత 4 సంవత్సరాల్లో  మరియు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయించిన 8,406 కోట్ల రూపాయిలు  కలుపుకొని 2019 – 24 వరకు సగటున వార్షిక బడ్జెట్ కేటాయింపులు  సుమారు రూ.6,000 కోట్లకు పెరిగాయి .
రాష్ట్రంలో పనులు  జరుగుతున్న ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులు :
ఆంధ్రప్రదేశ్‌లో 31 కొత్త  రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి, ఇందులో  5,581 కిలోమీటర్లు 70,000 కోట్ల విలువైన 16 కొత్త లైన్లు మరియు 15 డబ్లింగ్ లైన్ల పనులు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి, నెల్లూరు, రాజమహేంద్రవరం, ఒంగోలు, కాకినాడ, కర్నూల్, అనంతపురం లోని స్టేషన్లతో సహా మొత్తం 72 రైల్వే స్టేషన్‌లను ఆధునిక  మౌలికసదుపాయాలతో  అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం  చర్యలు తీసుకున్నది.
విశాఖపట్నం – సికింద్రాబాద్,  తిరుపతి – సికింద్రాబాద్ మరియు విజయవాడ-చెన్నై మధ్య కొత్త  వందే భారత్ రైలు విజయవంతమైన ఆక్యుపెన్సీ రేట్ తో  నడుస్తున్నాయి.
కర్నూలులో మిడ్‌లైఫ్‌ రిహాబిలిటేషన్‌ ఫ్యాక్టరీ: ఈ ప్రాజెక్టుకు  2023 – 24 సంవత్సరంలో  రూ.125 కోట్లు కేటాయించారు
ఈ ప్రాజెక్టులన్నీ  సకాలంలో  పూర్తీ  కావడానికి 2024 – 25 ఆర్థిక సంవత్సరం కూడా కేంద్ర రైల్వే శాఖా నుండి  కేటాయిపులు జరుగుతాయి,  అయితే  సమస్య  అంతా రాష్ట్ర ప్రభుత్వ వాటా  కేటాయింపులు  పైన, అవసరమైన భూమి సమకూర్చడం  పైన ఆధారపడి ఉంటుందనేది జగమెరిగిన సత్యం .
జాతీయ రహదారులు:
దేశంలో 2014 నాటికి 91,287 కిలోమీటర్ల జాతీయ రహదార్లు ఉండగా, 2023 నాటికి 60 శాతం వృద్ధితో 1,46,145 కిలోమీటర్ల నిడివికి పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ లో 2014కి ముందు జాతీయ రహదారుల  మొత్తం పొడవు : 4193 కి.మీ అయితే
31 డిసెంబర్ 2022 నాటికి  మొత్తం పొడవు : 8683 కి.మీ.
ఆంధ్రప్రదేశ్‌లో  2022-23 సంవత్సరానికి 31,000 కోట్ల విలువైన 39 జాతీయ రహదారుల ప్రాజెక్టులు కేంద్రప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడ్డాయి.
58,318 కోట్ల విలువైన 134 జాతీయ రహదారుల  ప్రాజెక్టులు 3,605 కి.మీల మేరకు  పొడవుతో  గత మూడేళ్లలో పూర్తైన  లేదా నిర్మాణంలో ఉన్నా ప్రాజెక్టులు రాష్ట్రంలో ఉన్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో పనులు జరుగుతున్నా  ప్రధాన జాతీయ  రహదారులు:
50 వేల కోట్లతో 1270 కిలోమీటర్ల  సూరత్ నుండి చెన్నై ఎక్స్‌ప్రెస్ వే లో ఆంధ్రప్రదేశ్ నిడివి 320 కిలోమీటర్లు  – ఈ రహదారి ఢిల్లీ నుండి ముంబై వరకు ఉన్న ఎక్ష్ప్రెస్స్ వే కు అనుసంధానం అయ్యి  ఉత్తర మరియు దక్షిణ భారత దేశమును ఈ రహదారి కలుపుతుంది.
భారతమాల ప్రాజెక్టు క్రింద  19 వేల కోట్లతో 342 కోట్ల రూపాయిల నిడివితో  పులివెందుల నుంచి మేదరమెట్లకు 6 వరుసల  గ్రీన్ఫిల్డ్ ఎక్ష్ప్రెస్స్ వే పనులు జరుగుతున్నాయి.
సాగరమాల ప్రాజెక్టు  క్రింద కత్తిపూడి నుండి ఒంగోలు (2 వరుసల  నుండి 4 వరుసల రహదారి  పూర్తిఅయింది )
30 వేల కోట్లతో  రాజధాని అమరావతి నుండి అనంతపురం వరకు 600 కిలోమీటర్ల నిడివి కలిగిన రాయలసీమకు మరియు బెంగళూరు వరకు వేయవలసిన రహదారికి అన్ని అనుమతులు వచ్చినా, కేవలం  అమరావతి పైన కక్షపూరితంగా ముఖ్యమంత్రి  జగన్మోహన రెడ్డి గారు రద్దు చేయడం వల్ల 2019 ఎన్నికలలో వైకాపాకు  అత్యధిక మెజారిటీ కట్టబెట్టిన వెనుకబడిన ప్రాంతమైన  పశ్చిమ  ప్రకాశం జిల్లాలో గిద్దలూరు, మార్కాపురం మరియు ఎర్రగుండపాలెం, రాయలసీమ జిల్లాలు అయిన కర్నూలు మరియు అనంతపురం ప్రాంత   ప్రజలు నష్ట పోయి  మోస పోయారు.
రాష్ట్రప్రభుత్వం  సకాలంలో భూసేకరణ చేసి ఇవ్వడంలో విఫలం అవ్వడం వల్ల జాతీయ రహదారుల నిర్మాణ సమయం పెరగడంతో ప్రాజెక్టుల  వ్యయం భారీగా పెరిగి పోతుంది.
కేంద్ర ప్రభుత్వ పథకాల పైన స్టిక్కర్లు :
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు  వికసిత సంకల్ప భారత్ యాత్ర లో పాల్గొని అధికారుల ద్వారా  కేంద్రప్రభుత్వ  పథకాల వివరాలు తెలుసుకొని వాటి పైన వారి కుటుంబ పేర్లతో  స్టిక్కర్లు వేయడం ఆపాలి.
రెండు రోజుల క్రితం జగనన్న చేయూత అని రోడ్డు పైన విధి వ్యాపారం చేసే  హాకర్ల కోసం ఇచ్చే రుణాల రాయితీ   పీఎం స్వానిధి నిధులకు బటన్ నొక్కాడు
రాష్ట్రంలో పేదల నివాసం కోసం కేంద్రం సహాయం చేసిన  25 లక్షల గృహాలు  పీఎం ఆవాస యోజనకు జగనన్న కాలనీలని ప్రజలను వైకాపా నాయకులు  ఏమరుస్తున్నారు
బడికి వెళ్లే చిన్న పిల్లలకు పీఎం పోషణ నిధులను జగనన్న గోరుముద్దగా మర్చి పిల్లలను మోసం చేస్తున్నారు .
గరీబ్ కళ్యాణ్ అన్న యూజన ద్వారా 2.70 కోట్ల మంది ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఉచితంగా బియ్యం కేంద్రం ఇస్తుంటే రేషన్ షాపుల వద్ద వైస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేలాడుతున్నాయి.
ఆయుష్మాన్ భారత్ : ఆరోగ్య భీమా క్రింద 5 లక్షల రూపాయిల వరకు వైద్య సహాయం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం హాస్పిటల్స్ కు బిల్లులు చెల్లించక పోవడం వల్ల సరైన సమయంలో వైద్యం అందక పేద రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
చిన్న చిన్న బిల్లులే హాస్పటల్స్ కు సకాలంలో చెల్లించకుండా ఆరోగ్య శ్రీ 25 లక్షలకు పెంచమనడం  బూటకం.
ఆంధ్రప్రదేశ్ లో “ ఆయుష్మాన్  భారత్  “ పేరు పక్కకు నెట్టి  “ వైస్సార్  ఆరోగ్య  శ్రీ  “ పేరును ప్రచారం చేసుకుంటున్నారు.  కేంద్రప్రభుత్వం వాటా  60%, రాష్ట్రప్రభుత్వం  40% అయిన స్టికర్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిదే.
“విశ్వ కర్మ యోజన” కింద కేంద్ర ప్రభుత్వం  18 కేటగిరీల హస్తకళా కార్మికులకు శిక్షణతో పాటు ఉచితంగా 15 వేల రూపాయల విలువైన పరికరాలు  మరియు  ఆర్థిక సహాయాన్ని అందించడానికి 13 వేల కోట్ల బడ్జెట్‌తో ప్రోత్సహించడానికి ప్రాధాన్యత ఇచ్చారు.
కానీ పీఎం స్వనిది విషయంలో సీఎం స్టికర్ వేసుకున్నట్లే విశ్వ కర్మ యోజన విషయంలో ప్రచారం చేస్తున్నారు .
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో పర్యటిస్తున్న మోడీ  గ్యారెంటీ వాహనం వద్దకు వెళ్లి ప్రభుత్వ అధికారులు అర్హులైన పేద  ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలా ఏంత అందిస్తున్నారో వివరంగా చెబుతున్నారో తెలుసుకొని ఎవరు అందిస్తున్న నిధులకు ఎవరు బటన్ నొక్కుతూ ప్రచారం చేసుకుంటున్నారో ప్రజలకు వివరిస్తే బాగుంటుంది.