- భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్
- తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరుతో రాజధాని గ్రామం మందడంలో భోగి మంటల కార్యక్రమం.
- ఉదయం 7 గంటలకు గోల్డెన్ రూల్ స్కూల్ లో భోగి వేడుకల్లో పాల్గొన్న ఇరువురు నేతల
- ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేస్తూ కార్యక్రమం
అమరావతి :- టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భోగి వేడుకల్లో ఉమ్మడిగా పాల్గొన్నారు. ‘తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ కార్యక్రమం పేరిట అమరావతి రాజధాని పరిధి గ్రామమైన మందడంలోని గోల్డెన్ రూల్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో ఉదయం 7 గంటలకు పాల్గొన్నారు.
జగన్ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ప్రతులను భోగి మంటల్లో దహనం చేసారు. జగన్ మోసపు హామీలు, పెత్తందారి పోకడలు, నిరుద్యోగ సమస్య, గంజాయి మాఫియా, అధిక ధరలు – పన్నుల బాదుడు, జె.బ్రాండ్స్, రైతు సంక్షోభం, అహంకారం నశించాలి అన్న ప్లకార్డులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. అనంతరం ఆయా గ్రామాలకు చెందిన రైతులతో చంద్రబాబు, పవన్ ముచ్చటించి వారి బాధలు అడిగి తెలుసుకున్నారు.