రజనీకాంత్ కథానాయకుడిగా చాలా కాలం క్రితం దర్శకుడు పి.వాసు రూపొందించిన ‘చంద్రముఖి’ సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమా సీక్వెల్ ను ‘చంద్రముఖి 2’ పేరుతో లారెన్స్ హీరోగా పి.వాసు రూపొందిస్తున్నాడు. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది.
ప్రస్తుతం మైసూర్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఐదుగురు కథానాయికలు సందడి చేయనున్నారు. ఆ జాబితాలో లక్ష్మి మీనన్ .. మంజిమా మోహన్ .. మహిమ నంబియార్ .. సృష్టి దాంగే .. సుభిక్ష కృష్ణన్ పేర్లు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ అంతా షూటింగులో జాయిన్ అయ్యారు.
అయితే ఈ ఐదుగురిలో అసలు ‘చంద్రముఖి’ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. మేకర్స్ ఆ విషయాన్ని గోప్యంగానే ఉంచుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.