వెనుకబడిన జిల్లాల్లో ప్రకాశాన్ని చేర్చడంపై హర్షం

దర్శి, మహానాడు : దర్శి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లాని చేర్చటం, అవసరమైన నిధులను మంజూరుకు కృషిచేసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్‌ రెడ్డికి లక్ష్మి, డాక్టర్‌ కడియాల లలిత సాగర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఇద్దరు ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలతో కలిసి ఢిల్లీ వెళ్లి నియోజకవర్గంలోని సమస్యలను వివరించారు.

ముఖ్యంగా వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లా చేరడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి, ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ,  నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, జిల్లా ఎమ్మె ల్యేలు దామచర్ల జనార్దన్‌, డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ముత్తుముల అశోక్‌ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య తదితరులు ఉన్నారు.