Mahanaadu-Logo-PNG-Large

చిరు అవార్డు సరే… మధ్యలో వర్మ గోలేంటి?

ఫిల్మ్‌ ఇండస్ట్రీ అయినా వేరే ఏ ఇండస్ట్రీ అయినా సరే తమ కష్టాన్ని గుర్తించగలిగే గౌరవం దక్కితే ఆ ఆనందమే వేరు. ఇటీవలె మెగాస్టార్‌ చిరంజీవికి ప్రతిష్ఠాత్మకమైన అవార్డు పద్మవిభూషణ్‌ సత్కరించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పద్మభూషణ్ పుర‌స్కారం ద‌క్కించుకున్న‌ ఐదుగురిలో చిరంజీవి ఒక‌రు. ఈ అవార్డ్ భార‌త‌దేశంలో అసాధారణమైన, విశిష్ట సేవలు చేసేవారికి మాత్రమే దక్కుతుంది. ఈ పుర‌స్కారంతో టాలీవుడ్ లో అరుదైన గౌర‌వం అందుకున్న న‌టుడిగా చిరు చ‌రిత్ర సృష్టించారనే చెప్పాలి. దీనికి పరిశ్ర‌మలోని వారంతా ఎంతో ఆనందంగా ఆయనకు అభినందనలు తెలిపారు.

ఇక ఇదిలా ఉంటే… వివాదాల దర్శకుడు ప్రతీ విషయాన్ని ఏదో ఒక విధంగా లాగి దాన్ని కాంట్రవర్సీ చేయకపోతే నిద్ర పట్టదు మన రామ్‌గోపాల్‌ వర్మకి. ఈ అవార్డు విషయంలో కూడా అదే జరిగింది. అవార్డు విషయంలో ఆయన స్పందిన తీరు అందరికీ షాకిచ్చింది. రామ్ గోపాల్ వర్మ మైక్రోబ్లాగింగ్ సైట్ Xలో త‌న నిర్వేదాన్ని వ్య‌క్తం చేసారు. “నేను శ్రీ పద్మా సుబ్రహ్మణ్యం లేదా శ్రీ బిందేశ్వర్ పాఠక్ గురించి ఎప్పుడూ వినలేదు. మెగాస్టార్‌తో సమానమైన స్థితిలో వారిని ఉంచడానికి నేను అస్సలు థ్రిల్లింగ్ గా లేను. అవార్డుకు చిరంజీవి గారు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా నటిస్తాను“అని అన్నారు.

పద్మా సుబ్రహ్మణ్యం ప్రపంచ ప్రఖ్యాతి చెందిన భారతీయ శాస్త్రీయ నృత్యం భరతనాట్య క‌ళాకారిణి అయితే, బిందేశ్వర్ పాఠక్ ఒక సామాజిక శాస్త్రవేత్త కం సామాజిక వ్యవస్థాపకుడు. గత సంవత్సరం ఆగస్టులో మరణించారు. ఇప్పుడు ఆర్జీవీ వారి పేర్ల‌ను ఎందుకు తెర‌పైకి తెచ్చిన‌ట్టు? అన్న‌ది ఎవరికీ అర్ధంకాలేదు. దీంతో ఒక వ్యక్తి వ‌ర్మ‌కు చీవాట్లు పెడుతూ ఇలా రాసాడు. “మీరు బిందేశ్వర్ పాఠక్ గురించి మరింత చదవాలి. ఎందుకంటే మీ జ్ఞానం కొన్ని రాష్ట్రాలు లేదా ప్రాంతాలకు కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం అయింది“ అని అన్నారు. మ‌రొకరు ఇలా వ్యాఖ్యానించారు, “బిందేశ్వర్ పాఠక్ గురించి మీరు వినకపోతే అది మీ సమస్య. ఆయన సూపర్‌స్టార్‌ కంటే తక్కువ కాదు.. మీరు చెప్పేది మెగా స్టార్ గురించేనా“ అని అన్నారు. ఇంతకీ వర్మ స్ట్రయిట్‌గా వస్తున్నాడా లేక ఏదన్నా వంకరగా మాట్లాడుతున్నాడా అన్నది కొంతమంది నెటిజన్లకు అర్ధం కాలేదు.