సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలి

– బిఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అద్యక్షురాలు, మాజీ యంపి మాలోత్ కవిత

మహబూబాబాద్: నిండు శాసనసభలో నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా? ఆడబిడ్డలంటే అంత అలుసా.., అధికారం ఉన్నదనే మితిమీరిన గర్వమా? రేవంత్ రెడ్డి అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకో. ఆడబిడ్డలను ఏడిపిస్తే ఆ ఉసురు ఊరికే పోదని మరిచిపోకు. ఎమ్మెల్యేలు సబితఇంద్రారెడ్డి, సునీతలక్ష్మారెడ్డికి క్షమాపణ చెప్పకుంటే తెలంగాణ మహిళాలోకం సియం రేవంత్ రెడ్డిని క్షమించదు. ఆడబిడ్డల ఆత్మగౌరవం గురించి ప్రశ్నిస్తే బిఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టులు చేయిస్తారా? మీ..పాపాలను ప్రజలు లెక్కకడుతున్నారు. తగిన సమయంలో.. ఇంతకింత గుణపాఠం నేర్పుతారు.