-ఫుటేజ్‌ను అందజేసిన టీడీపీ బృందం
-పిన్నెల్లిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్
నరసరావుపేట, మహానాడు: పల్నాడు జిల్లాలో ఈవీఎం ధ్వంసం ఘటనపై టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవి నేని ఉమ, జూలకంటి బ్రహ్మారెడ్డి, ఏ.ఎస్.రామకృష్ణ డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన ఫుటేజ్‌ను డీజీపీకి అందజేశా రు. ఎమ్మెల్యే పిన్నెల్లిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఒక అధికార ప్రతినిధి చేయాల్సిన పనులేనా? పిన్నెల్లి విధ్వం సానికి అంతులేకుండా పోయింది. మాచర్లలో ఉన్న ఎస్సైలు, సీఐలకు పోలీసు ఉన్నతాధికారులు చెప్పే పరిస్థితిలో లేరు. రెవెన్యూ, ఇతర అధికారులను సైతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కంట్రోల్ చేస్తున్నాడు. తురక కిషోర్, పిన్నెల్లి లాంటి వ్యక్తు లు సమాజానికి చేటు. రాడ్లు పట్టుకుని ఎదురొచ్చిన వాళ్లపై దాడులు చేయడమే వారి పని. పోలింగ్ బూత్‌లో బ్యాలెట్‌ను ధ్వంసం చేస్తుంటే అడ్డుకున్న టీడీపీ నేతను చంపేందుకు యత్నించారు. ప్రశ్నించిన మహిళను బూతులు తీట్టాడు.
ఇలాంటి రాక్షస నాయకులను వెంటనే అరెస్టు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. చంద్రగిరిలో పులివర్తి నానిని అరెస్టు చేయాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చి కుట్ర చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని, తాడిపత్రిలో కేతిరెడ్డిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. రాజంపేటలో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ చైతన్య తాడిపత్రికి రావా ల్సిన అవసరం ఏముంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆదేశాలతో జేసీ నివాసంపై దాడి చేసిన డీఎస్పీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.