ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాది జరిగిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి. రిజల్ట్స్ వెలువడే తేదీని అధికారులు ప్రకటించనున్నారు. ఈ ఏడాది మే 6 నుంచి 24 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. మొత్తం 4,64,756 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. విద్యార్థులు ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ bse.ap.gov.in or https://bie.ap.gov.in/ లోకి వెళ్లి వారి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.
bse.ap.gov.in వెబ్ సైట్లోకి వెళ్లిన తర్వాత… హోమ్ పేజ్ లో ఇంటర్ ఫలితాల లింక్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత లాగిన్ వివరాలను నమోదు చేసి, ఎంటర్ బటన్ నొక్కాలి. వెంటనే మీ రిజల్ట్స్ స్క్రీన్ పై కనపడతాయి. రిజల్స్ట్ కాపీని సేవ్ చేసుకోవచ్చు లేదా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఈసారి ఇంటర్ విద్యార్థులకు డిజిటల్ స్కోర్ కార్డు ఇవ్వనున్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సబ్జెక్టులో 33 కంటే ఎక్కువ మార్కులు సాధించాల్సి ఉంటుంది. 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ స్కాలర్ షిప్స్ కు అర్హులవుతారు.