గుడివాడలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పాల్గొననున్న రా కదలిరా బహిరంగ సభ నభూతో న భవిష్యత్తు అన్న చందంగా జరుగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి శ్రీదేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
కృష్ణాజిల్లా గుడివాడలో సభా ప్రాంగణంలో ఏర్పాట్లను తెదేపా నేతలు వెనిగండ్ల రాము, రావి వెంకటేశ్వరరావు, కుమార్ రాజాలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 వ తేదీ న చంద్రబాబు నాయుడు గారు పాల్గొననున్న రా కదలిరా బహిరంగ సభకు ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు తరలివస్తున్నారని గతంలో నిమ్మకూరు నుంచి గుడివాడ ర్యాలీకి ట్రాఫిక్కు రైల్వే గేట్లు ఉంటూ అడ్డంకులు సృష్టించాడని నేడు ఆ కుట్రలు పనిచేయవని అన్నారు.
ఇరవై ఏళ్లు ఎమ్మెల్యే గా ఉన్న నాని గుడివాడ పట్టణం సహా నియోజకవర్గంలో ఎక్కడ రోడ్లు వేయలేక పోయాడని విమర్శించారు. సొల్లు కబుర్లు చెప్పడం తప్ప గుట్కా నానికి అభివృద్ధి ఏంటో తెలియదని.. పట్టిసీమ, పోలవరం ఎక్కడ ఉన్నాయో తెలుసా అని ప్రశ్నించారు.
జగన్ బూట్లు నాకుతూ సజ్జల స్క్రిప్ట్ చదువుతూ చంద్రబాబు గారు ఆయన కుటుంబం పై ఇష్టానుసారం మాట్లాడిన బూతుల నానికి ఈ సభ ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.. రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పనున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బూరగడ్డ వేదవ్యాస్,వీరంకి గురుమూర్తి, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.