– మాజీ మంత్రి కే ఎస్ జవహర్
దళితుడు బొంత మహేంద్రది ఆత్మాహత్య కాదు.. హోంమంత్రి చేయించిన హత్య అని మాజీ మంత్రి కే ఎస్ జవహర్ విమర్శించారు. గురువారం మాజీ మంత్రి కే ఎస్ జవహర్ విలేఖరులకు విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ… జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు అధికమయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని దుమ్మేరు గ్రామంలో బొంత మహేంద్ర అనే దళితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో హోంమంత్రి తానేటి వనిత ను ఏ1 ముద్దాయిగా చేర్చాల్సిన అవసరం ఉంది.
హోంమంత్రి ఎవరెవరికి ఫోన్‌లు చేశారో.. ఎవరు ఒత్తిడి తెస్తే అతనిని అరెస్ట్ చేసి వేధించారు అనే నిజాలు సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. అందుకని హోంమంత్రిని సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసి విచారించాలి. నియోజకవర్గంలో హోంమంత్రి అరాచాకాలు అధికమయ్యాయి. దళిత యువకులు ఇబ్బందులు పెడుతున్నారు. గతంలో దళిత యువకుడు చిన్నాను ఎలా ఇబ్బంది పెట్టారో అందరూ చూసారు. చిన్నా ఉదంతం మొదలుకొని ఇప్పుడు మహేంద్ర ఆత్మహత్య వరకు పూర్తిగా హోంమంత్రి కనుసన్నల్లోనే జరిగాయి. హోంమంత్రి ప్రధాన అనుచరులు వలనే ఆత్మహత్య, దాడులు జరిగాయి.
దళితుడు బొంత మహేంద్రది ఆత్మాహత్య కాదు హోంమంత్రి చేయించిన హత్య. హోంమంత్రి నుంచి పోలీస్ ఉన్నతాధికారులు, ఎస్ఐ భూషణం అందరూ కలిసి పన్నాగం పన్నితే అందులో ఎస్ఐను బలి చేసారు. హోంమంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేసి ఈ కేసు యోక్క దర్యాప్తుకు సహకరించాలని డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు ఆమె స్వచ్ఛందంగా అందరి కాల్ డేటాలను బయట పెట్టి ప్రజలకు నిజాల్ని తెలియచెప్పాలి. బొంతు మహేంద్ర కుటుంబాన్ని అదుకొని వారికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించాలి.
దళిత డ్రైవర్ ను డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీపై కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వేధింపులకు గురిచేస్తేనే ఆత్మాభిమానం గల మహేంద్ర మృతి చెందడం బాధాకరం. ఆ కుటుంబం ధుఖ: సమయంలో ఉంది. కనీసం ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి కూడా వైసీపీ నాయకులు వెళ్లలేదు. పోలీసు పికెట్ ఏర్పాటు చేసి 41 నోటీసులు ఇచ్చి ఇక్కడి నుంచి ఎక్కడికి కదలకుండా హౌస్ అరెస్టు లు చేయడం చూస్తుంటే ఈ రాష్ట్రం అప్రకటిత అత్యవసర పరిస్థితి నడుస్తోందనిపిస్తోంది. ప్రజాస్వామ్యవాదులందరూ దీన్ని ముక్త కంఠంతో ఖండించాలని మాజీ మంత్రి కే ఎస్ జవహర్ పిలుపునిచ్చారు.