డార్లింగ్‌ ఈ షాకేంటి.. ఒక్కసారిగా?

సలార్‌ మూవీతో ప్రభాస్‌ బాక్సాఫీస్‌ కలెక్షన్లను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో సక్సెస్‌ కొట్టి చాలా కాలమయిందని చెప్పవచ్చు. స‌లార్ బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం వ‌రుస‌గా క్రేజీ పాన్ ఇండియా చిత్రాల్లో న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేకుండా ఉన్న అత‌డు స‌డెన్ గా ఒక నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని గుస‌గుస వినిపిస్తోంది. తొంద‌ర్లోనే త‌న షూటింగుల‌కు విరామం ఇవ్వాల‌నుకుంటున్నాడ‌ని తెలిసింది. గ్యాప్ లేని షూటింగుల‌తో రెస్ట్ లెస్ గా మారిన ప్ర‌భాస్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం. ఇటీవ‌ల‌ స‌లార్ – క‌ల్కి రెండు చిత్రాల షూటింగ్‌లు ఒకేసారి సైమ‌ల్టేనియ‌స్ గా చిత్రీక‌రించారు. క‌ల్కి చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా సాగుతోంది. అదే క్ర‌మంలో స‌లార్ విశ్రాంతి తీసుకోవాల‌ని అనుకుంటున్నారు. త్వ‌ర‌లో యూరోప్ లో స‌ర్జ‌రీ చేయించే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని కూడా తెలిసింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. సలార్ కి సానుకూల సమీక్షలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్ర‌భాస్ కెరీర్ లో మరో ఉత్త‌మ విజ‌యం అందుకున్నాడు. ఇదే ఉత్సాహంలో స‌లార్ 2లోను న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. కొంత‌ విరామంతో తన జీవితంలో కొత్త శక్తిని నింపడానికి… త‌ర్వాత‌ తన కెరీర్‌పై దృష్టి సారించడానికి ఒక అవకాశంగా భావిస్తున్నాడు. ముఖ్యంగా ఆరు సంవత్సరాల నిరంతర సవాళ్లను ఎదుర్కొన్న తర్వాత అత‌డు విరామం కోరుకుంటున్నాడు. అయితే ప్రభాస్ విరామం కేవలం ఒక నెల మాత్రమే. అతడు తిరిగి మార్చిలో తన త‌దుప‌రి ప్రాజెక్ట్‌లను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే యూరోప్‌లో శస్త్రచికిత్స చేయించుకోవచ్చని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.