బ్లాక్‌బస్టర్ ‘మగధీర’తో సహా పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు, ఆకర్షణీయమైన నటనతో దేవ్ గిల్ అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన నేతృత్వంలో దేవ్ గిల్ ప్రొడక్షన్స్ నుంచి మొదటి ప్రాజెక్ట్ రాబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘అహో! విక్రమార్క’ అంటూ రాబోతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
‘అహో! విక్రమార్క’ టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ 2024 మార్చి 8న పుణెలోని పింప్రి చించ్‌వాడ్‌లోని డాంగే రోడ్‌లో ఎంతో ఘనంగా జరిగింది. భారీ తారాగణంతో రానున్న ‘అహో! విక్రమార్క’ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
నటుడిగా మారిన నిర్మాత, మగధీర ఫేమ్ దేవ్ గిల్ ఈ ప్రాజెక్ట్ గురించి చెబుతూ.. ‘అహో! విక్రమార్క’తో, మహారాష్ట్ర పోలీసుల ధైర్యాన్ని మరియు అంకితభావాన్ని ఆకర్షణీయంగా, ప్రభావవంతంగా ప్రదర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము” అని పేర్కొన్నారు.
దర్శకుడు పేట త్రికోటి ఈ చిత్రం గురించి చెబుతూ..”‘అహో! విక్రమార్క’ ద్వారా, భాష, సంస్కృతులను, వీరత్వం, త్యాగం సారాంశాన్ని చిత్రీకరించడానికి మేము ప్రయత్నిస్తున్నాము” అని అన్నారు.
ఈ చిత్రంలో దేవ్ గిల్, సాయాజీ షిండే, ప్రవీణ్ తార్డే, తేజస్విని పండిట్, చిత్ర శుక్లా, ప్రభాకర్, విక్రమ్ శర్మ మరియు బిత్తిరి సత్తిలతో కూడిన భారీ తారాగణం నటిస్తోంది. యాక్షన్, ప్రేమ, భావోద్వేగం వంటి అంశాలతో ఈ చిత్రం రాబోతోంది. ‘అహో! విక్రమార్క’ దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.