టిటిడి లో అ”ధర్మ” పాలన అంతమైంది
బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్హత లేకపోయినా “సకల శాఖల” అధికారిగా,ఫుల్ అడిషనల్ చార్జ్ ఈవోగా పెత్తనం చెలాయించిన ధర్మారెడ్డిని తొలగించి సీనియర్ సిన్సియర్ ఐఏఎస్ అధికారి శ్యామల రావు ని ఎన్డీఏ ప్రభుత్వం ఈఓ గా నియమించడం శ్రీవారి భక్తుల విజయంగా భావిస్తున్నాం అన్నారు!
నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సందర్భంగా తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పిన 24 గంటలలో ధర్మారెడ్డిని FAC ఈఓ నుంచి రివర్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం దైవానుగ్రహం అన్నారు!
ధర్మారెడ్డి సార్ కి ఇచ్చిన క్యాజువల్ లీవ్ మెమోలో రాష్ట్రం విడిచి వెళ్లొద్దు అని స్పష్టంగా చెప్పడం చూస్తే ఓ ముద్దాయికి కోర్టు “కండిషన్ బెయిల్” ఇచ్చి రాష్ట్రం విడిచి పోవద్దు అని చెప్పినట్లు ఉంది ఇంతకన్నా అవమానం ఏ అధికారికైనా జరుగుతుందా!
తిరుమల కొండపైన అతి పురాతనమైన “పార్వేటి మండపాన్ని” ఎవరి అనుమతితో కూల్చారు? అందుకు బాధ్యులైన ధర్మారెడ్డిని టిటిడి చీఫ్ ఇంజనీరింగ్ కి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇప్పటివరకు నోటీసులు ఇవ్వకుండా, సంజాయిషీ అడగకుండా మౌనంగా ఉండటంలోని ఆంతర్యం ఏమిటి? రాష్ట్రపతికి ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి కి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా,స్టేట్ సర్వే ఆఫ్ ఇండియా నిర్లక్ష్య ధోరణిని వివరిస్తూ లేఖ రాస్తున్నానన్నారు!
భారతదేశంలో పురాతన కట్టడాలను సంరక్షించాల్సిన ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా స్టేట్ ఆర్కియాలజీ శాఖలు పనిచేస్తున్నాయా లేవా అర్థం కావడం లేదని పార్వేటి మండపాన్ని కూల్చి కొత్తది కట్టడాన్ని మీరు సమర్థిస్తే భవిష్యత్తులో పురాతణ కట్టడాలు కనుమరుగైపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో పురాతన కట్టడాలని సంరక్షించలేని ఏఎస్ఐ దేశంలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని ఆవేదన వ్యక్తం చేశారు
జగన్మోహన్ రెడ్డి దగ్గర తనకున్న లాబీయింగ్ ను ఆసరాగా చేసుకుని టీటీడీ లో ధర్మారెడ్డి “ఓ నియంతలా” వ్యవహరిస్తూ తిరుమల పవిత్రతను,ఆలయ సాంప్రదాయాలను,శ్రీవారి భక్తుల మనోభావాలను, అర్చక స్వాములను,టిటిడి ఉద్యోగస్తులను వేధించడం శ్రీవారి సొమ్ముని మంచినీళ్లలా ఖర్చు పెట్టినందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారన్నారు!
ధర్మారెడ్డి సారూ అధికార బలంతో అహంకారంతో కోర్టులలో తప్పించుకొని ఫుల్ అడిషనల్ చార్జ్ ఈవోగా రెండు సంవత్సరాలు తిష్ట వేశావు, అర్హత కలిగిన ఐఏఎస్ అధికారులను టీటీడీ EO గా రానీయకుండా ధర్మకర్తల మండలి సమావేశాలలో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలపై చేసిన తీర్మానాలపై చంద్రబాబు నాయుడు శ్రీవారి భక్తునిగా సమగ్రమైన దర్యాప్తునకు ఆదేశించాలని నమ్మలేని నిజాలు, అవినీతి అక్రమాలు వెలుగులోకి వస్తాయన్నారు!
శ్రీవారి భక్తులుగా మేమంతా మా వెంకటేశ్వర స్వామిని ముద్దుగా “ఎన్కౌంటర్ స్పెషలిస్ట్” అని పిలుచుకుంటాము ఎందుకో తెలుసా శ్రీవారు తప్పు చేసిన ప్రతి ఒక్కరిని పద్ధతి మార్చుకోమని పదేపదే హెచ్చరిస్తారు పద్ధతి మార్చుకుంటే ఆశీర్వదిస్తారు లేదంటే “హెల్త్ వెల్త్ ఫేమ్” మటాష్ ఎన్కౌంటరే ధర్మారెడ్డి సారూ అర్థమైందా?