ధర్మం కోసం యుద్ధం… పవర్ స్టార్‌

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ తాజా అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా టీజర్ ను త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని అధికారికంగా వెల్లడించనప్పటికీ టీజర్ విడుదలకు సంబంధించి ఈ సినిమా మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ఈ సినిమా షూటింగ్ కు హాజరుకాలేక పోతున్నారు. దీంతో షూటింగ్ మొదలై చాలా రోజులు అయినప్పటికీ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఇంకా సగం కూడా కాలేదని తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘మీ ముందుకు ధర్మం కోసం యుద్ధం త్వరలో..’ అంటూ పవన్ కల్యాణ్ ఫొటోతో ఈ పోస్టర్ ను రూపొందించారు. హరిహర వీరమల్లు సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. క్రిష్‌ టీం ఇప్పటికే రిలీజ్‌ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలతో పవన్ కల్యాణ్ అభిమానులలో హరిహర వీరమల్లు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.