– ఫిర్యాదులొస్తే వారిపై కఠిన చర్యలు
– వాలంటీర్లపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఫిర్యాదు
– వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని డిమాండ్
– వాలంటీర్ల వైసీపీ సేవలపై ఆధారిలచ్చిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధులు
– స్పందించిన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్‌కుమార్ మీనా
– ఇప్పటికే ఆదేశాలిచ్చామన్న మీనా
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లోని చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ కార్యాలయంలో చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా ను సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ జాయింట్ సెక్రెటరీ వల్లం రెడ్డి లక్ష్మణరెడ్డి ,విజయవాడ నగర పూర్వ మేయర్ డాక్టర్ జంధ్యాల శంకర్ ,ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రా ర్ ప్రొఫెసర్ ఎన్ .రంగయ్య కలిసి ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితా స్వచ్ఛమైనదిగా రూపొందించాలని కోరారు .
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వాలంటీర్లు ,వార్డు సచివాలయ సిబ్బంది ల నేతృత్వంలో ఓటరు జాబితా రూపొందిస్తున్నారని వీరిలో అత్యధికలు అధికార పార్టీ కార్యక్రమాలలో మరియు ప్రభుత్వ కార్యక్రమాలలో కలగాపులకంగా పనిచేస్తున్నారని, తద్వారా ప్రజాస్వామ్యం జయప్రదం కావటానికి, ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగటానికి అవకాశం ఉండదని తెలిపారు .ఫారం 7 పూర్తి చేస్తూ అనేక ఓట్లను తొలగిస్తూ అవకతవకలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని వివరించారు. ఫారం 7 ద్వారా ఒక ఓటర్ ను తొలగించేటప్పుడు తప్పనిసరిగా ఆ ఓటర్‌కి నోటిసు ఇవ్వాలని, వారి దృష్టికి తీసుకొని వచ్చిన తర్వాతనే ఓట్లు తొలగించాలని కోరారు .
ఈ విషయమై సిటిజెన్స్ ఫర్ డెమొక్రసీ ఇప్పటికే సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయటం జరిగిందని నెంబర్ అయిందని వారి దృష్టికి తీసుకువెళ్లారు . మరో వైపు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల చేర్పులు మార్పుల్లో జరుగుతున్న పాలను వారి దృష్టికి కూడా లేఖ రూపంలో తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలి అనే ఒక కార్యక్రమాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావడం కోసం చేసిన ఒక పెద్ద ప్రయత్నం గా వారి దృష్టికి తీసుకొస్తూ, ఈ కార్యక్రమంలో వాలంటీర్లు సచివాలయ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారనీ తెలిపారు.
రాజకీయ పార్టీ కార్యక్రమానికి ప్రభుత్వ కార్యక్రమాలకు తేడా లేకుండా ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలియజేయడమైనది .చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా స్పందిస్తూ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఒక లెటర్ రాసిందని వారికి త్వరలో సమాధానం తెలియజేస్తామని ,క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని ఇప్పటికే వాలంటీర్ లను ఎన్నికల విధుల్లో వినియోగించుకోరాదని పదేపదే చెప్పడం జరిగిందని ,సచివాల సిబ్బంది విషయంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని సానుకూలంగా స్పందించారు.