తండేల్‌ ఆ విషయంలో తడబడతాడా?

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి కలిసి నటించిన లవ్‌స్టోరీ సూపర్‌డూపర్‌ హిట్‌ అయిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి కాంబోలో మరో చిత్రం రాబోతుంది. అదే తండేల్‌. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్‌ మొదలయి మంచి ఫ్లోలో కూడా ఉంది. ఇక ఈ చిత్ర టీజర్‌ ప్రేక్షకుల్లో ఓ రేంజ్‌లో హైప్‌ని క్రియేట్‌ చేసింది. షూటింగ్‌ జరిగిన కొంత భాగం వరకు జాగ్రత్తగా విజువల్స్‌ కట్‌ చేసి దర్శకుడు చందూ మొండేటి తన ప్రతిభను చూపించుకున్నాడనే చెప్పాలి. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న తండేల్ మీద సుమారు వంద కోట్ల దాకా బడ్జెట్ అవ్వొచ్చనే టాక్ కూడా మరో పక్క సినీ వర్గాల్లో వినిపిస్తోంది. థియేట్రికల్ బిజినెస్ కోణంలో ఆలోచించకుండా కంటెంట్ మీద నమ్మకంతో నిర్మాతలు ఖర్చుకి వెనకాడటం లేదట.

అయితే ఇది ప్యాన్ ఇండియా మూవీ కావడంతో కాస్తంత శ్రద్ధ అవసరమయ్యేలా ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ లో యాంటీ పాకిస్థాన్ సెంటిమెంట్ అంతగా వర్కౌట్ కావడం లేదు. చెప్పిందే.. చెప్పి…విన్నదే.. వినిపిస్తుంటే ప్రేక్షకులకు కి కూడా బోర్‌ కొట్టేస్తుంది.ని ఆడియన్స్ అసహనంగా ఉన్నారు. అందుకే టైగర్ 3, ఫైటర్ లకు పెద్దగా ఓపెనింగ్స్ రాలేదు. ట్రైలర్ లోనే స్టోరీ చెప్పేయడంతో ఇంతకన్నా ఏముంటుందనే అభిప్రాయం వచ్చేసింది ప్రేక్షకుల్లో.. మరి ఈ ట్రెండ్ కి నాగచైతన్యకి కనెక్షన్ ఏంటంటే తండేల్ కూడా పాకిస్థాన్ లో ఇరుక్కుపోయిన స్నేహితులను హీరో విడిపించుకుని వచ్చే ప్లాట్ మీద జరుగుతుంది.

వాళ్ళ అనుకోని పరిస్థితుల్లో జైల్లో బందీ కావడం, తప్పించుకోవడం, అక్కడి ఆఫీసర్లకు సవాల్ విసరడం మొత్తం సినిమా అంతా అదే స్టైల్లో నడుస్తుంది. మరి ఎక్కడా రొటీన్‌ పాత రొడ్డ కథలాగా అనిపించకుండా డిఫరెంట్‌గా ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. అందులోనూ బాలీవుడ్‌లో ఇది కీలక అంశంగా తీసుకుంటారు. ఇక మేకర్స్‌ ఈ చిత్రం విడుదల ఎప్పుడు అనేది ఇంకా అనౌన్స్‌ చేయాల్సి ఉంది.