వైసీపీ నేతలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు.
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు
అమరావతి: పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు స్పందించారు. పోస్టల్ బ్యాలెట్‌పై గెజిటెడ్ అధికారి సంతకం తో పాటు స్టాంప్ ఉండాలన్న నిబంధన లేదు. ఈసీ ఏదో సడలింపులు ఇచ్చిందని దీనివల్ల అక్రమాలు జరుగుతాయి అనే వాదన అసంబద్ధమని వ్యాఖ్యానించారు. ఈసీ సడలింపు ఇవ్వలేదని, నిబంధనలపై క్లారిటీ మాత్రమే ఇచ్చిందని తెలిపారు. గతానికి భిన్నంగా గెజిటెడ్ అధికారులను ఈసీ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసింది. ఈసీ నియమించిన అధికారులే పోస్టల్ బ్యాలెట్‌ను నిర్ధారిస్తూ సంతకం పెట్టారు. ఈ కారణంగానే సదరు అధికారి సంతకం చాలు అని ఈసీ స్పష్టత ఇచ్చింది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే నిబంధన అమల్లో ఉంది. వైసీపీ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో అర్థం లేని ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.