ఢిల్లీ మంత్రి స‌త్యేంద్ర జైన్ ఇంట్లో ఈడీ సోదాలు…

మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో ఇప్ప‌టికే అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ కీల‌క నేత‌, ఢిల్లీ మంత్రి స‌త్యేంద్ర జైన్ ఇంటిలో మంగ‌ళ‌వారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) సోదాలు చేప‌ట్టింది. ఈ సోదాల్లో మంత్రి ఇంటిలో 1.80 కిలోల బంగారం, రూ.2.82 కోట్ల న‌గ‌దు ల‌భ్య‌మయ్యాయి. ఈ బంగారం, న‌గ‌దుకు సంబంధించి స‌త్యేంద్ర జైన్ స‌రైన వివ‌రాలు చెప్ప‌లేక‌పోవ‌డంతో వాటిని ఈడీ అధికారులు సీజ్ చేశారు.

కోల్‌క‌తాకు చెందిన ఓ కంపెనీతో మ‌నీ ల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డుతున్నార‌ని చాన్నాళ్ల నుంచి స‌త్యేంద్ర జైన్‌పై ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈ వ్య‌వ‌హారంపై ఇటీవ‌లే కేసు న‌మోదు చేసిన ఈడీ అధికారులు గ‌త వారం ఆయ‌న‌ను అరెస్ట్ చేయగా, కోర్టు రిమాండ్‌కు పంపిన సంగతి విదితమే.