రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సినీ హీరో నారా రోహిత్ జన్మదిన వేడుకలు

సినీ నిర్మాత అట్లూరి నారాయణ రావు ఆధ్వర్యంలో హైదరాబాద్, అనంతపురం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పుట్టిన రోజు వేడుకలు
సినీ హీరో నారా రోహిత్ జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పాఠశాలలు, అనాధ ఆశ్రయాలు, ఆస్పత్రుల్లో కేక్ కటింగ్ చేసి పండ్లు, స్వీట్స్ పంచి పెట్టారు. పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సీనీ నిర్మాత అట్లూరి నారాయణ రావు ఆధ్వర్యంలో హైదరాబాద్, అనంతపురం, కృష్ణా జిల్లా నందిగామతో పాటు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని అనాధ ఆశ్రయంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్బంగా విద్యార్దులంతా రోహిత్ పేరు అక్షరాల క్రమంలో నిల్చుని నారా రోహిత్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమరావతి రైతులూ పాల్గొని రోహిత్ కు శుభాకాంక్షలు తెలిపారు.