Mahanaadu-Logo-PNG-Large

ఇంటర్నేషనల్ స్థాయిలో ‘గామి’ : హీరో విశ్వక్ సేన్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి కథానాయిక. ఈ సినిమాకు క్రౌడ్ ఫండ్ చేశారు. వి సెల్యులాయిడ్ ప్రజెంట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తింది. ఈ చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో హీరో విశ్వక్ సేన్ విలేకరుల సమావేశంలో ‘గామి’ విశేషాలని పంచుకున్నారు.

గామి జర్నీ ఎప్పుడు మొదలైయింది?
దర్శకుడు విద్యాధర్ నేను చేసిన ‘వెళ్లిపోమాకే’ చూసి సంప్రదించారు. అప్పటికి ‘ఈ నగరానికి ఏమైయింది’ రిలీజ్ కాలేదు. తను కథ చాలా పెద్ద కాన్వాస్ లో కథరాసుకున్నాడు. తను ఆ కథని తీయగలడనే నమ్మకంతో ప్రాజెక్ట్ లోకి వెళ్లాను. ఆ సినిమాకి ఐదేళ్ళు పడుతుందని నాకు ముందే తెలుసు. ఒకవేళ ఏడాదిలో తీయాలనుకుంటే వందకోట్ల పైగా బడ్జెట్ అవుతుంది. వారణాసి, కుంభమేళలో గొరిల్లా షూట్ చేయగలిగాం. అలా బడ్జెట్ కలిసొచ్చింది. సమయమే దీనికి పెద్ద పెట్టుబడి. ఇది ఎప్పుడొచ్చిన కొత్తగా వుండే సినిమా. ఎందుకంటే ఈ తరహాలో ఇప్పటివరకూ ఎవరూ తీయలేదు. ఎప్పుడు వచ్చినా ఇంతే అద్భుతమైన క్యాలిటీతో రావాలని ముందే నిర్ణయించుకున్నాం. ఇప్పుడు సరైన టైమ్ లోనే వస్తున్నాం.

అప్పటికి ఇప్పటికి మీ ఇమేజ్ లో మార్పు వచ్చింది కదా దానికి గట్టట్టు ఏమైనా మార్పులు చేశారా?
అలా చేస్తే సినిమా చెడిపోతుంది. మా టీంలో అ సందేహలు ఎవరికీ లేవు. ఆ మీటర్ లో లెక్కలు వేసుకొని చేసిన సినిమా కాదు.

మీ సినిమాల్లో ముందు పాటలు హిట్ అయి జనాల్లోకి వెళతాయి.. గామి మాత్రం అందుకు భిన్నంగా వుంది కదా?
గమ్యాన్ని పాట ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత పిక్ అప్ అయ్యింది. శంకర్ మహదేవన్ గారు పాడిన పాటని శ్రీశైలంలో విడుదల చేస్తున్నాం. అది బావుంటుంది. నిజానికి ఈ సినిమా ప్రమోషన్స్ దగ్గర నుంచే చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా ఈ సినిమాలో ఏమి ఉండవో క్లియర్ గా చెప్పాను. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాలు చాలా వున్నాయి. ‘తుంబాద్’ సినిమాలో కూడా ఎలాంటి హంగులు వుండవు. కానీ కథలో లీనమైపోతాము. గామి చాలా ఎమోషనల్ ఫిల్మ్. క్యారెక్టర్స్ కి కనెక్ట్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే మొత్తం ఊపిరాడనివ్వదు.ఈ సినిమాకి పెద్ద కమర్షియల్ ఎలిమెంట్ ఎమోషన్. ఖచ్చితంగా ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక క్రిస్టఫర్ నోలన్ సినిమా చూసిన అనుభూతిని అందిస్తుంది.

దర్శకుడు విద్యాధర్ గురించి ?
విద్యాధర్ షూటింగ్ ముందు స్క్రిప్ట్ అంతా చదవాలని చెప్పాడు. చదవాను. చాలా పెద్ద స్క్రిప్ట్. చదువుతున్నప్పుడే అసలు దిన్ని ఎలా తీయగలమనే భయం వేసేది. ఈ సినిమా కోసం దర్శకుడు ఓ మూడేళ్ళు ముందుగానే ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకున్నాడు. తన ఆఫీస్ అంతా ప్రిపరేషన్ వుంటుంది. దాదాపు తొమ్మిదేళ్ళు ఈ సినిమాతోనే వున్నాడు. తను అనుకున్న సినిమాని అనుకున్నట్లు తీయాలంటే ఎలాంటి రిసెర్చ్ చేయాలో ముందుగానే చేసుకున్నాడు. ఈ సినిమా టీం మొత్తం పది శాతం అయితే 90 శాతం కష్టం దర్శకుడిదే.

గామి విశ్వక్ సేన్ గేమ్ ఛేంజర్ అంటున్నారు.. కథ, మేకింగ్ పరంగా అనుకోవచ్చా ?
ప్రతి సినిమాకి ఒకలానే కష్టపడతా. ప్రాణం పెట్టి పని చేస్తాను. గామికి ఎంత కష్టపడ్డానో గ్యాంగ్స్ అఫ్ గోదావరి, మొకానిక్ రాకీ కి కూడా అంతే కష్టపడ్డాను. ఈ మూడూ గేమ్ ఛేంజర్స్ గానే భావిస్తాను.

గామికి ఐదేళ్ళు పట్టింది కదా లుక్స్ పరంగా ఎలాంటి కేర్ తీసుకున్నారు ? అఘోరగా కనిపించడానికి ఎలాంటి హోం వర్క్ చేశారు?
లుక్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. పదిహేను రోజులకు ముందే షూటింగ్ గురించి తెలిసాక మెల్లగా ఆ లుక్ లోకి రావడానికి ప్రిపేర్ అయ్యేవాడిని. అఘోర పాత్ర కోసం దర్శకుడు కావాల్సిన రిసెర్చ్ ఇచ్చారు. కుంభమేళాలో అయితే కొన్ని లక్షల మంది అఘోరాలు వుంటారు. వారిలో కలసిపోయి వుండేవాడిని. నా స్టయిల్ లో ఎక్స్ ఫ్లోర్ చేసుకుంటూ వెళ్లాను. నిజంగా నేను అఘోరా అనుకోని చాలా మంది దానాలు చేశారు. ఈ సినిమా ప్రతి రోజు ఒక సవాలే. మైనస్ 30 డిగ్రీల్లో షూట్ చేశాం. కాళ్ళు చేతులు గడ్డలు కట్టేసేవి. నిజంగా అవి తచుకుంటే ఇంత రిస్క్ చేశామా అనిపిస్తుంది. ఇప్పుడు చేయమంటే మాత్రం చేయను. (నవ్వుతూ)

ట్రైలర్ లో చాలా పాత్రలకు, వారికి ప్రత్యేక కథలు వున్నట్లు కనిపించింది. అన్నిటికి లింక్ ఉంటుందా?
అది సినిమా చూస్తున్నపుడు తెలుస్తుంది. స్క్రీన్ ప్లే మాత్రం డన్‌కిర్క్ స్టయిల్ లో వుంటుంది. సినిమా చూస్తున్నపుడు ఈ స్క్రీన్ ప్లే ని చాలా ఎంజాయ్ చేస్తారు. స్క్రీన్ ప్లే అందరికీ అర్ధమయ్యేలానే వుంటుంది. సౌండ్ చాలా అద్భుతంగా వుంటుంది. టెక్నికల్ ఎలిమెంట్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ మైండ్ బ్లోయింగ్ గా వుంటుంది. ఇందులో నా పాత్రకు డైలాగ్స్ తక్కువ వుంటాయి. కంప్లీట్ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా వుంటుంది. చాందిని, అభినయ ఇలా అందరి పాత్రల్లో డెప్త్ వుంటుంది.

మీరు నిర్మాత కూడా కదా.. ఈ సినిమాకి సపోర్ట్ చేశారు ?
ఈ సినిమాకి నేను చేసిన సపోర్ట్ రెమ్యునిరేషన్ తీసుకోకపోవడం. వాళ్ళకి బర్డెన్ కాలేదు. మొదట రోజు సెట్ లో ఎలాంటి లైఫ్ స్టయిల్ లో వున్నానో ఆరు నెలలు క్రితం షూట్ కి వెళ్ళినప్పుడు కూడా అలానే వున్నాను. డెబ్బై రోజులు ఈ సినిమా కోసం పని చేశాను. నిజంగా ఈ సినిమా షూటింగ్ ఒక సాహసమే. మంచు పడితే ప్రాణానికే ప్రమాదం అని తెలిసి కూడా షూటింగ్ కి వెళ్ళేవాళ్ళం. చాందిని కూడా చాలా కష్టపడింది.

మిగతా భాషల్లో సినిమా విడుదల చేస్తున్నారా ?
ప్రస్తుతం తెలుగు రిలీజ్ పై ద్రుష్టి పెట్టాం. సినిమాని పీసిఎక్స్ ఫార్మెట్ లో రిలీజ్ చేస్తున్నాం. మన దగ్గర నాలుగు స్క్రీన్ వున్నాయి. ఒక తెలుగు సినిమా ఈ ఫార్మెట్ లో రావడం ఫస్ట్ టైం.