ప్రతి సినిమాలో తన 100 పర్సెంట్ ఇస్తూ సౌత్ ఆడియన్స్ ను ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ని అలరిస్తూ వస్తుంది సమంత. మధ్యలో పర్సనల్ లైఫ్ డిస్ట్రబెన్స్ వల్ల కాస్త వెనుకపనప్పటికీ మొత్తం సెట్ రైట్ అవ్వడంతో తిరిగి వరుస ప్రాజెక్ట్ లను ఓకే చేస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ లో మరో వెబ్ సీరీస్ ను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సమంత తన ఓన్ ప్రొడక్షన్ లో మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా ప్రకటించిన రోజే ఒక క్రేజీ పోస్టర్ తో సర్ ప్రైజ్ చేసింది. సమంత బంగారం సినిమా కోసం ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ కష్టపడుతుందని తెలుస్తుంది. ఐతే సినిమా ప్రకటించినా సరే ఈ ప్రాజెక్ట్ ని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారన్నది రివీల్ చేయలేదు. అంతేకాదు కథ కథనాలు ఎలా ఉంటాయన్నది కూడా రివీల్ చేయలేదు. జస్ట్ పోస్టర్ తోనే తన సొంత బ్యానర్ సినిమాపై బజ్ పెంచింది సమంత. ఐతే సమంత బంగారం సినిమాకు భారీ బడ్జెట్ ను కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రొడక్షన్ కొత్త అయినా కూడా అన్ని విషయాల్లో సమంత సమర్థవంతంగా పనులు కొనసాగిస్తుంది. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే సమంత ఈ సినిమాను నిర్మించడానికి రంగంలోకి దిగింది. ఐతే ముందు లిమిటెడ్ బడ్జెట్ లో పూర్తి చేయాలని అనుకున్నా కూడా సినిమాకు ఇంకాస్త బడ్జెట్ పెడితే పెద్ద స్థాయిలో అవుట్ పుట్ వస్తుందని భావించి ముందు అనుకున్న దానికన్నా సమంత బంగారం కోసం డబుల్ బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు సమంత యాక్టింగ్ చేసి సంపాదించిన దానిలో తీస్తే అమ్మడు ఈ సినిమా నిర్మాణానికి ఖర్చు చేస్తుందని అంటున్నారు. అసలు సినిమా ప్రొడ్యూస్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో ఏమో కానీ తన డేర్ నెస్ కి అందరు సూపర్ అనేస్తున్నారు. ఇకపోతే కొంత మంది ఇలా అంటుంటే.. మరికొంత మంది సోషల్ మీడియాలో గతంలో పెద్ద పెద్ద వాళ్ళే సినిమాలు ప్రొడ్యూస్ చేసి చేతులు కాల్చుకున్నవారు కూడా ఉన్నారు మరి సమంత ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుందని కూడా అంటున్నారు. ఉదాహరణకి ఒకప్పుడు సావిత్రి కూడా సినిమాలు తీసి చాలా వరకు లాస్ అయిందని అంటుంటారు.