మహేష్, రాజమౌళి సినిమానా అయితే ఇంకేమి ఆ సినిమానే వేరే లెవెల్లో ఉంటది. అందులోనూ జక్కన్న పాన్ ఇండియా సినిమా అంటే ఇంక ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆ క్రేజ్ ఆ బడ్జెట్ ఆ లొకేషన్స్ అబ్బో.. ఆ హంగామానే వేరు. అయితే ఇంతకీ స్టోరీ ఏంటి ఎక్కడ తీయబోతున్నారు అనే విషయాల పైన ప్రపంచ వ్యాప్తంగా మీడియా మొత్తం అలర్ట్గా ఉంది. మహేష్ 29వ సినిమాగా రాబోతున్న తరుణంలో అంచనాలు కూడా తారాస్థాయిలో ఉన్నాయి. కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాను నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఇక ఈ సినిమాలో మహేష్ లుక్ చాలా డిఫరెంట్గా ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే బాహుబలి పంథాలోనే రెండు పార్టులను ఒక దాని వెంట మరోటి రిలీజ్ చేసేలా ప్లానింగ్ ఉందట.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీ నుంచి ఈ సినిమా గురించి వినిపిస్తున్న మాటలు ఏంటంటే… సెకండ్ పార్ట్ లో మరో ఇద్దరి స్టార్స్ ని కూడా తీసుకొచ్చేలా చూస్తున్నారట. ఆ ఇద్దరు ఎవరంటే… ఎన్.టి.ఆర్, రాం చరణ్ అని అంటున్నారు. ఇంతకీ రాజమౌళి వారిద్దరినే ఎందుకు తీసుకుంటున్నాడు. వారిద్దరితో ఆర్ఆర్ఆర్ తీసేశాడుగా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్ లో రాజమౌళికి ఆర్ఆర్ఆర్ సినిమాతో గుర్తింపు రావడంతో వీరిద్దరిని మహేష్ సినిమాలో కూడా ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నాడట.
ఇంతకీ ఇందులో నిజమెంతవరకు ఉందో తెలియదు కానీ… ఇలా ముగ్గురు హీరోలు ఒకేసారి తెరమీద కనిపిస్తే మాత్రం ఫ్యాన్స్కి పండగే పండగ.. అన్న పదం చాలా చిన్నదయిపోతదేమో మరి. మహేష్ సినిమాపై వస్తున్న ఈ వార్తల్లో ఏది వాస్తవం ఏది రూమర్ అన్నది తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. ఇక కథ విషయానికి వస్తే ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా హాలీవుడ్ రేంజ్ లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించబోతున్నారట.