ఆడే..పండుగాడు..!

ఔను..అతడు రాజకుమారుడే..
తొలినాటి యువరాజు..
కౌబాయ్ గా విఫలమై..
లవర్ బాయ్ బాబీగా
కూడా ఫెయిలై..
హిట్టు కొట్టిన మురారి..

జీవితంలో కిరికిరి తెలియని పోకిరి..ఇది నిజం..
తొలి తుపాను
తలొంచి చూస్తే
ఆ నిప్పు కణం అతడు..
సాయంలో శ్రీమంతుడు..
ఆదరణలో దూకుడు…
తానున్న తావున
సినిమాలు శతదినోత్సవం..
నిర్మాతలకు బ్రహ్మోత్సవం..
మహేష్ బాబు..
అందానికి నిర్వచనం..
ఆత్మీయతకు బహువచనం..
ప్రతి మాట ప్రియవచనం!

ఇందిరమ్మ వాకిట్లో
సిరిమల్లె చెట్టు…
అతడు కొడితే మైండ్ బ్లాక్ అయిద్దో లేదో కాని
నవ్వితే మల్లెలు విరిసినట్టే
వెన్నెలే మురిసినట్టు..
ఆకాశం మెరిసినట్టు..
మేకప్ అవసరం లేని గెటప్..
పక్కింటి కుర్రాడి సెటప్..
మాంచి పికప్..
టాలీవుడ్ గోల్డ్ కప్..!

అందమైన ఆవేశం..
ప్రతి సినిమాలో సందేశం..
ఖలేజా ఉన్న
బిజినెస్ మాన్…
వదనమేమో ఫుల్ మూన్..
అరుపులు వినిపించని ఫ్యాక్షన్
ప్రశాంతమైన డిక్షన్…
వీటితో అబ్బురపరిచే
మహేష్ యాక్షన్!

ఇదే కదా ఇదే కదా నీ కథ
కృష్ణ గారబ్బాయి కథ..
చిన్నప్పుడే ఎంట్రీ..
వెనకాల పెద్ద ఫ్యామిలీ ట్రీ..
నాన్నకి తగ్గ కొడుకు
అన్నని మించిన తమ్ముడు..
తెలుగు సినిమా
ఆధునిక మహర్షి..
మహేష్ బాబూ..కొన్ని పాత్రల పోషణలో నిజంగా
సరిలేరు నీకెవ్వరు..
పేరులో పానిండియా
ఉండదేమో గాని
నీ సినిమాలకు
సర్కారు వారి పాటే
మూడు వందల
కోట్లకు పైబడి..
నీ నిర్మాతలకు
రాబడే రాబడి..
అలా పెరుగుతూనే ఉండాలి
నీ పలుకుబడి..!
నాన్నేమో డేరింగ్..
నువ్వేమో డార్లింగ్..!!
🎂🎂🎂🎂🎂🎂🎂
మహేష్ బాబుకు
జన్మదిన శుభాకాంక్షలతో..

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286