ఆమె గొంతు చిత్రం..
ఆ మాధుర్యం అదో విచిత్రం..
పాట పాడుతుంటే మంత్రం..
అలుపెరుగని
పాటల యంత్రం
చిత్రసీమకు లీల..సుశీల..జానకి..
వాణి..చిత్ర..
సమ్మోహనగాత్ర
పంచతంత్రం..!
మౌనంగానే ఎదగమని
మొక్క నీకు చెబుతుంది..
ఎదిగిన కొద్దీ ఒదగమనే
అర్ధమందులో ఉంది..
ఇలాంటి ఓ పాట..
అందులో ఆర్ద్రత..
చిత్రమ్మ గొంతులో ఆ నమ్రత
నిజంగానే స్వీట్ మెమరీ..
అలాంటి పాటలు
ఇరవైఅయిదు వేలు పాడి
చిత్ర సృష్టించింది హిస్టరీ..
తానయింది స్వరమాధురీ
ఒక లెజెండరీ..!
వేణువై వచ్చాను భువనానికి
గాలినైపోతాను గగనానికి..
కట్టలు తెగిన రోదన..
ఆమె గొంతే తెగిపోతుందా
అన్నంత బాధ..
మాతృదేవోభవ..
ఆమెలోని అమ్మ
తనలోని కోకిలమ్మ..
ఎంతలా రోదించిందమ్మా..
కొన్నాళ్ళ తర్వాత
అదే శోకం..
బిడ్డను దూరం
చేసుకున్న బాధ
తన జీవితాన్నీ
ఆవరిస్తుందని తెలిసినట్టే..
గుండెను పిండేసినట్టే..!
ఎదిగిన కొద్దీ ఒదగమనే
తత్వమామెలో ఉంది..
పాడమంటే ఇప్పటికీ బిడియమే..
చక్కని గొంతు..
అందమైన సిగ్గు..
మైకు చేతికొస్తే
ఆ వినయానికి తన్మయం
వింటున్న మనకి పరవశం..
చిత్రమ్మా..
నిను కోరి వర్ణం..
సుశీలమ్మ తర్వాత
నీతోనే సినీ పాటల యుగం
మరోసారి స్వర్ణం..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286