‘ట్రెండు’ల్కర్!

అద్భుతమైన ఆటతో..
చక్కని నడవడితో..
దేశప్రజలను ఆకట్టుకున్న సచిన్ టెండూల్కర్
అందుకే చెరిగిపోని కీర్తి
బౌండరీలు దాటుకుంటూ వాళ్ళింటికి చేరిపోయింది..!

ఎందరికో ఎన్నో విధాల
స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి
క్రికెట్ పాఠాలు నేర్పిన దిగ్గజం
పాడ్స్, గ్లోవ్స్..
హెల్మెట్..వాటితో పాటు
మాస్క్..సానిటైజర్…
ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒకనాడు తప్పించుకొలేకపోయాడు
కరోనా కోరల నుంచి..
అది అటాక్ చేసి
హౌస్ దట్ అని అడిగింది
మాస్టర్ బ్లాస్టర్ కోరాడు
డిఆర్ఎస్ రివ్యూ..
ఖచ్చితంగా నాటౌట్..
వందకు పైగా సెంచరీలు
చేసిన సచిన్..
నిజ జీవితంలోనూ
వంద గ్యారంటీ
కరోనాను గెలిచి..
కొత్త స్టాన్స్ తో..
సరికొత్త ఇన్నింగ్స్ కు సిద్ధమై..!

సచిన్ రమేష్ టెండూల్కర్
వివాదాలకు దూరమై
పోతపోసిన బంగారమై..
భారతరత్నమై..
రిటైర్మెంట్ జీవితం ప్రశాంతంగా..
మరింత స్ఫూర్తిదాయకంగా..
ఆల్ ది బెస్ట్ లిటిల్ మాస్టర్..
ఎన్నో రికార్డులు
తలవంచలేదా నీ ముందు
నీ టాలెంట్..ఒక పేటెంట్..
నీ నడవడి..ఓ ఒరవడి..
మన చిన్నోడు భరత జాతి స్థైర్యానికి,స్ఫూర్తికి
అసలు సిసలైన ఆనవాలు!

*ఇ.సురేష్ కుమార్*
9948546286