జగన్‌ జైలు పక్షి!

– మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్

గుంటూరు, మహానాడు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధిత ప్రాంతాల్లో ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ జైలు పక్షిలా సమాజానికి ఇబ్బందికరంగా వ్యవహరించే వ్యక్తులను పరామర్శించడానికి జైలుకు వెళ్ళడం వారి విధానాన్ని చాటుతోందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు.

కొల్లిపర మండలం బొమ్మవాని పాలెం గ్రామంలో వరద బాధితులకు హార్వెస్ట్ ఇండియా సంస్థ ప్రతినిధి కత్తెర సురేష్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ హనీ క్రిస్టినా అందించే నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో ఆలపాటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హార్వెస్ట్ ఇండియా సంస్థ నిర్ణయం అభినందనీయమన్నారు. సాయం చేసేందుకు మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ స్పందిస్తుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ తమ నైజాన్ని చాటుకుంటున్నారని ఆరోపించారు.