యావజ్జీవ కారాగార శిక్ష పడేది జగన్మోహన్ రెడ్డికే
-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
యావజ్జీవ కారాగార శిక్ష పడేది జగన్మోహన్ రెడ్డికేగానీ, చంద్రబాబుకు కాదని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు.
మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు …
చంద్రబాబుకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందని జగన్ పగటి కలలు కంటున్నాడు. ఏ సాక్ష్యాలు లేవని కోర్టులు ఘోషిస్తున్న కేసుల్లో చంద్రబాబుకు యావజ్జీవ శిక్ష పడితే, 11 కేసుల్లో ఛార్జిషీట్లు వేసిన జగన్ కు ఎన్ని యావజ్జీవ శిక్షలు పడాలి? 12 సంవత్సరాల క్రితం జగన్ పై వివిధ కేసుల్లో 11 చార్జిషీట్లు వేయడం జరిగింది. జగన్ పై చార్జిషీట్లను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. సీబీఐ శాఖ సాక్ష్యాలు కూడా కోర్టుకు సమర్పించింది. ప్లేయర్లు ఛెస్ ఆడినట్లు జగన్ ఎమ్మెల్యేలను బదిలీ చేస్తూ ఆడుకుంటున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకుని క్విడ్ ప్రోకో కు జగన్ పాల్పడలేదా?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకుని క్విడ్ ప్రోకో కు పాల్పడి జగన్ తన వ్యాపారాలను అభివృద్ధి చేసుకోలేదా?ఈ క్విడ్ ప్రోకోను సాక్ష్యాధారాలతో సహా ప్రూ చేయడం కూడా జరిగింది. రాజశేఖర్ రెడ్డి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చడంతో దానికి బదులుగా క్విడ్ ప్రోకో విధానం ద్వారా జగన్ కు లాభం చేకూర్చారు. అది నిజ నిర్దారణ అయింది.
అలాంటప్పుడు జగన్ కు జగన్ కు ఎన్ని జన్మలు శిక్ష పడాలి. చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో ఒక్క దాంట్లో కూడా ఛార్జిషీట్ వేయలేదు. ఆయనకు యాంటిసిపేట్ బెయిల్ ఇచ్చారు. చంద్రబాబుపై పెట్టిన 3 కేసులను సరిగా దర్యాప్తు చేయని ఆఫీసర్లను సస్పెండ్ చేయాలి.
చంద్రబాబు తప్పులు కనపడడంలేదని కోర్టులు స్పష్టంగా చెప్పాయి
చంద్రబాబు తప్పులు కనపడడంలేదని కోర్టులు చెబుతూ, పోలీసు శాఖే తప్పు చేసిందని కోర్టు చీవాట్లు పెట్టింది. పోలీసు, సీఐడీ అధికారులను కోర్టు జడ్జిమెంట్ లో ఛీకొట్టింది. పోలీసులకు అరెస్టు చేసే అధికారం ఉంటే సరిపోదు, పోలీసులు అధికారాన్ని జాగ్రత్తగా వినియోగించాలి. కేవలం ఉత్తుత్తి ఆరోపణల ఆధారంగా అరెస్టు చేయకూడదు.
సరైన దర్యాప్తు చేసి ఆరోపణలకు ఆధారం ఉంటేనే ముందుకు పోవాలి, హడావిడిగా అరెస్టు చేసి ఆ తర్వాత మిగతావి చూసుకుందాంలే అనే ధోరణి పనికిరాదు. బాధ్యత లేని, దురుద్దేశం గల పోలీసు అధికారులకు ఇది అలవాటుగా మారిందని జడ్జిమెంటులో చంద్రబాబు కేసును దర్యాప్తు చేసిన అధికారులను ఆచెంప, ఈచెంప వాయించారు.
కోర్టుకు హాజరు కాకుండా జగన్ 3,500 వాయిదాలు తీసుకున్నారు, ఇది సబబేనా?
కోర్టుకు హాజరు కాకుండా జగన్ 3,500 వాయిదాలు తీసుకున్నారు, మరి సామాన్యులకు కూడా ఇన్ని వాయిదాలిస్తారా? జగన్ కళ్లల్లో ఆనందం చూడటానికి కొందరు పోలీసు అధికారులు చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టడానికి అత్యుత్సాహం చూపారని కోర్టే చెప్పింది. 2004లో కోటి 73 లక్షలు మాత్రమే కలిగివుండే జగన్ ఆస్తి అమాంతం ఎలా పెరిగిందని న్యాయమూర్తులే ప్రశ్నించారు. నష్టాల్లో ఉన్న కంపెనీ 10 రూపాయల షేరును 350 రూపాయలకు ఎవరు కొంటారని న్యాయమూర్తులే ప్రశ్నించారు.
జగన్ అవినీతిపరుడని సుప్రీం కోర్టు జడ్జీలకు కూడా అర్థమైపోయిందని వారి వ్యాఖ్యలే తెలియజేస్తున్నాయి. జగన్ కు మాత్రమే వాయిదాలకు రానక్కర్లేదనే రాయితీ ఎందుకు? దేశంలోని న్యాయవ్యవస్థ ప్రజలకు సమాధానం చెప్పాల్సివుంది. చంద్రబాబుకు యావజ్జీవ శిక్ష పడుతుందని జగన్ అందరితో చెప్పుకోవడంలో అర్థంలేదు. జగన్ ఊహించుకోవడానికి, కల కనడానికి కూడా ఒక అర్థముండాలి. జగన్ ఒక తెలివిలేని వ్యక్తి.
జగన్ రూ.43 వేల కోట్లు ఎలా సంపాదించారు అని జడ్జీనే అడిగారు
‘‘జగన్ రూ.43 వేల కోట్లు ఎలా సంపాదించారు’’ అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆల్తాబ్ ఆలం ప్రశ్నించడం జరిగింది. నా సర్వీస్ లో ఇటువంటి కుంభకోణం చూడలేదు, ఇన్ని కోణాలున్న కేసు చూడలేదు’’ అని సీబీఐ మాజీ డైరెక్టర్ వ్యాఖ్యానించారు.
’’కంపెనీల పనితీరును చూసి పెట్టుబడి పెట్టారని’’ జగన్ తరపు న్యాయవాది గోపాల సుబ్రహ్మణ్యం సుప్రీం కోర్టుకు చెప్పగా ’’ నష్టాల్లో ఉన్న కంపెనీల్లో రూ.350 ప్రీమియంతో పెట్టుబడి ఎలా పెట్టారు?’’ అని జగన్ లాయర్ ను సుప్రీంకోర్టు జస్టిస్ ఆప్తాబ్ ఆలం గారు ఎదురు ప్రశ్న వేస్తే దానికి జగన్ లాయర్ నుండి సమాధానం లేదు.
దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన ఆర్థిక నేరగాల్లను శిక్షించకపోతే మొత్తం సమాజం నష్టపోతుంది. హత్యలు, ఆవేశ వేడిలో జరగవచ్చు. కానీ, ఆర్థిక నేరాలు మాత్రం నింపాదైన లెక్కలు, ఉద్దేశ పూర్వకమైన ప్రణాళిక, సమాజ ప్రయోజనాలను గాలికొదిలి వ్యక్తిగత లాభాలను దృష్టిలో ఉంచుకునే చేస్తారు. సుప్రీం కోర్టు ధర్మాసనంలోని జస్టిస్ సదాశివం, జస్టిస్ ఎంవై ఇక్బాల్.
ఈ కేసుల్లో నిందితులకు బెయిల్ ఇచ్చే సమయంలో కోర్టు ఆరోపనల స్వభావాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వాటిని సమర్తించే సాక్ష్యాధారాలను చూడాలి. నేరం నిరూపితమైతే పడే శిక్ష తీవ్రతనూ గమనించాలి. నిందితుడి ప్రవర్థన, అతని చుట్టూ ఉన్న ప్రత్యేక పరిస్థితులు విచారణ కోర్టు ముందు హాజరు కావడానికి గల అవకాశాలు, సాక్ష్యాలు తారుమారు చేయగలరన్న సహేతుక ఆందోళనను దృష్టిలో పెట్టుకోవాలి. దేశ విస్తృత ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలి’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇంత చేసినా వారిలో చలనం లేదు. అవినీతిలో ఘనాపాటి అనడానికి జడ్జీల వ్యాఖ్యలే నిదర్శనం. జడ్జీలు ఈ విధంగా కామెంట్ చేసినా ఏమీ సమాధానం చెప్పరు. పైగా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతారు. జగన్ పై 12 సంవత్సరాలుగా విచారణ జరపలేదు. న్యాయవ్యవస్థ జగన్మోహన్ రెడ్డి కేసులో ఆలోచన చేయాలని గౌరవ న్యాయవ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నానని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.