నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెడీ అవుతోన్న బిగ్గెస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీ కల్కి 2898ఏడీ. ఈ చిత్రం రెండు భాగాలుగా సిద్ధం అవుతోంది. మొదటి పార్ట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో మహావిష్ణు 10వ అవతారం అయిన కల్కి క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే భవిష్యత్తులో ఇండియా ఎలా ఉంటుంది. యుద్దాలు ఎలా జరుగుతాయి. కల్కి రాక వంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఈ సినిమాలో నాగ్ అశ్విన్ చూపించబోతున్నాడు. కల్కి కోసం ఓ కొత్త ప్రపంచాన్ని నాగ్ అశ్విన్ క్రియేట్ చేశారు. మూవీ మొత్తం ప్రత్యేకంగా వేసిన సెట్స్, లో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలోనే తెరకెక్కించారు. కచ్చితంగా కల్కి మూవీ వండర్స్ క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా 200 కోట్లు నిర్మాత అశ్వినీదత్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎంతకి ఫైనల్ అయ్యిందో తెలియదు కానీ నెట్ ఫ్లిక్స్ కి ఈ మూవీ డిజిటల్ రైట్స్ మేగ్జిమమ్ ఖరారు అయిపోయాయని టాక్. 22 భాషలకి సంబందించిన హక్కులని కూడా నెట్ ఫ్లిక్స్ దక్కించుకుందని తెలుస్తోంది. అందుకే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు ఏ సినిమాకి ఇవ్వని పెద్ద మొత్తంలో కల్కి కోసం నెట్ ఫ్లిక్స్ వారు చెల్లించారంట. మే చివరలో లేదా జులైలో సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు మూవీ నుంచి గ్లింప్స్, పోస్టర్స్ రిలీజ్ చేసిన కూడా అంత ఎఫెక్టివ్ గా పబ్లిక్ లోకి సినిమాని తీసుకొని వెళ్ళలేక పోయారు. ఈ సారి టీజర్ తో అయిన కచ్చితంగా వైబ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అయితే అసలు కల్కి 2898ఏడీ మూవీ ఏంటి. సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ కి అలాగే కల్కి 2898ఏడీ కోసం క్రియేట్ చేసిన వరల్డ్ కి ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అయ్యే విధంగా యానిమేషన్ వీడియో ని సిద్ధం చేసి మూవీ రిలీజ్ కి ముందు ప్రేక్షకులకి అందించబోతున్నారంట. ఈ ఐడియా వర్క్ అవుట్ అయితే కచ్చితంగా కల్కి 2898ఏడీ స్ట్రాంగ్ గా జనాల్లోకి వెళ్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక కల్కి సినిమాలో బిగ్ స్టార్స్ కమల్ హాసన్ పవర్ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన పాత్ర కొంత సేపటి వరకే ఉంటుందట. సెకండ్ పార్ట్ లో మరింత ఎక్కువ నిడివి తో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటాని లాంటి బాలీవుడ్ స్టార్స్ తో పాటు మరికొందరు స్టార్స్ గెస్ట్ పాత్రలలో కనిపించనున్నారు. మొత్తానికి చాలా పెద్ద స్టార్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం అదే విధంగా చాలా హై బడ్జెట్ మూవీ అవ్వడంతో ఏమాత్రం బెడిసికొట్టినా చాలా ఇబ్బందే మరి చూద్దాం నాగఅశ్విన్ మ్యాజిక్ ఏంటో.