‘కన్నప్ప’ మూవీ నుంచి దేవరాజ్ లుక్ రిలీజ్*

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులందరి లుక్‌ను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటికే కన్నప్పగా విష్ణు మంచు లుక్ అందరినీ ఆకట్టుకుంది. నాథనాధుడిగా శరత్ కుమార్, చెంచు తెగ నాయకురాలిగా పన్నాగా పాత్రలో మధుబాల లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం దేవరాజ్ పాత్రకు సంబంధించిన లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
కన్నప్ప చిత్రంలో దిగ్గజ నటులున్నారన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం, మధుబాల వంటి వారు నటిస్తున్నారు. ఇప్పటికే కన్నప్ప వరల్డ్‌ని పరిచయం చేసి జనాల్లో హైప్ పెంచేశారు. ఇక ఇలా ప్రతీ సోమవారం ఒక అప్డేట్ ఇస్తూ ఆడియెన్స్‌లో మరింత ఆసక్తిని పెంచేస్తున్నారు.
తాజాగా దేవరాజ్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో దేవరాజ్ ఎరుకల తెగకు నాయకుడిగా కనిపించనున్నారు. ఎరుకల తెగ నాయకుడైన ‘ముండడు’ అనే పాత్రలో దేవరాజ్ అద్భుతమైన లుక్‌లో కనిపించనున్నారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
“కన్నప్ప” విజువల్ వండర్‌గా ఇండియన్ స్క్రీన్ మీద ఆకట్టుకోబోతోంది. ధైర్యవంతుడైన యోధుడు శివుని భక్తుడైన కన్నప్ప కథను గ్రాండియర్‌గా నిర్మిస్తున్నారు. కన్నప్ప అచంచలమైన విశ్వాసం తరతరాలుగా అందరికీ స్ఫూర్తినిస్తూ ఉంది.  ఎంతో అంకితభావంతో విష్ణు మంచు ఈ పాత్రను పోషిస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్‌లో ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రానున్నట్టుగా మంచు విష్ణు ప్రకటించిన సంగతి తెలిసిందే.