అత్తను చంపి…. భార్య గొంతు కోసి!!

సంగారెడ్డి:

సంగారెడ్డిలో ఒక వ్యక్తి తన అత్తను కిరాతకంగా హత్య చేసి, తన సొంత భార్య గొంతు కోసాడు. సంగారెడ్డిలోని పటానుచేరు మండలం ఇస్నాపుర పద్మారావు కాలనీ లో ఈ సంఘటన జరిగింది . రుద్రారం కి చెందిన సాయి బాబాకు తన అత్త శాంతమ్మపై కోపం పెంచుకుంటూ ఉన్నాడు. తన భార్య ని సంసారానికి పంపడం లేదని కోపం తో రగిలిపోయిన సాయి బాబా శాంతమ్మను కత్తితో పొడిచి హత్య చేశాడు.

శాంతమ్మపై దాడి చేస్తున్నది చూసిన భార్య సత్యవతి భర్తను అడ్డుకోగా, సాయిబాబా తన భార్యపై కూడా కత్తి తో దాడి చేసి తన గొంతు కోసి పరరాయ్యాడు. సత్యవతిని స్థానికులు ఆసుపత్రి కి తరలించారు. సాయిబాబా పటానుచేరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. తదుపరి పోలీసులు కేసు నమోదు చేస్కొని దర్యాప్తు చేస్తున్నాము అని తెలిపారు.