– కోరుకున్న చోట ప్లాట్
– రంగంలోకి మంత్రి నారాయణ
అమరావతి, మహానాడు: రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కోసం రంగంలోకి మంత్రి నారాయణ దిగారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చే రైతుల ఇళ్ళకు మంత్రి వెళ్ళారు. దీంతో భూములిచ్చేందుకు రైతులు ముందుకొస్తున్నారు. ఎర్రబాలెం లో 11 మంది రైతుల నుంచి 12.27 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వీకరణకు రంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో ఏమన్నారంటే… ఎవరైనా భూములు ఇవ్వాలనుకుంటే వారి ఇళ్ళకే వెళ్లి తీసుకుంటాం.. ల్యాండ్ పూలింగ్ ద్వారా ముందుగా భూములు ఇచ్చే రైతులకు ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్న భూముల్లో ప్లాట్ ల కేటాయింపు.
భూములిచ్చిన మరుసటి రోజే ప్లాట్ ఎంపిక చేసుకునే అవకాశం. గతంలో రాజధానికి భూములు ఇవ్వని రైతులు నేడు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. భూములు ఇచ్చే రైతుల ఇంటికి నేరుగా నేనే వస్తాను అని చెప్పాను. గతంలో భూములు ఇచ్చిన రైతులకు లాటరీ పద్ధతిలో ఫ్లాట్స్ ఇచ్చాం. ఇపుడు కొంత మేర భూములు మాత్రమే అవసరం. కాబట్టి ఇపుడు భూములు ఇచ్చే రైతులకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాం. ప్రభుత్వం దగ్గర ఎక్కడ భూమి ఉందో…అక్కడ వారు కోరుకున్న ప్లాట్స్ ఇవ్వనున్నాం. జగన్ ప్రభుత్వం రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను అపహస్యం చేసింది.