తెలుగు ప్రేక్షకుల కాళ్లు మొక్కుతానన్న హీరో సోహెల్

‘బిగ్‌‌బాస్’ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్ లో శ్రీ కోనేటి దర్శకత్వంలో గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్ పై ఎం.డీ పాషా నిర్మిస్తున్న చిత్రం బూట్‌ కట్ బాలరాజు. మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పాటలు, టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘బూట్‌ కట్ బాలరాజు’ ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, హీరోలు సందీప్ కిషన్, మంచు మనోజ్, రోషన్ కనకాల, దర్శకులు శ్రీకాంత్ ఓదెల, సాయి రాజేష్ ముఖ్య అతిధులుగా హాజరైన ఈ వేడుకగా గ్రాండ్ గా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో సోహెల్ మాట్లాడుతూ.. పాషా గారి లాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం. ఆయన మధ్య తరగతి కుటుంబం నుంచే వచ్చారు. సినిమా అంటే ప్యాషన్ తో చాలా హార్డ్ వర్క్ చేసి సినిమాని నిర్మించారు. ఈ సినిమా నిర్మాణం యాభై శాతం పూర్తయిన తర్వాత ఫైనాన్సియల్ గా కొంత ఇబ్బంది ఎదురవ్వడంతో నిర్మాత కాస్త ఒత్తిడికి లోనయ్యారు. ఆయన్ని ఒత్తిడి తీసుకోవద్దని చెప్పాను. మా నాన్న రిటైర్మెంట్ పైసలు, నేను సంపాదించినా పైసలు ఇల్లు కొనుక్కుందామని ఉంచుకున్నవి అన్ని ఈ సినిమాకు పెట్టాను. ఈ సినిమాతో నిర్మాతల కష్టాలు మరింతగా అర్ధమయ్యాయి. నిర్మాత దిల్ రాజు గారికి మా పరిస్థితి చెప్పాం. ఆయన చాలా గొప్ప మనసుతో ‘నైజాం నేను చూసుకుంటా, మీరు ఒత్తిడి తీసుకోవద్దు” అని చెప్పారు. ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఏలూరు విజయ్ గారు సినిమా నచ్చి తీసుకున్నారు. వారికి ధన్యవాదాలు. బ్రహ్మానందం గారు , సందీప్ కిషన్, మంచు మనోజ్, రోషన్ శ్రీకాంత్ ఓదెల, సాయి రాజేష్ గారు, సుమగారు ఇలా అందరూ ఈ వేడుకకు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించారు. వారందరికీ కృతజ్ఞతలు. దర్శకుడు కోనేటి గారు రెండేళ్ళు పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డారు. భీమ్స్ అన్న అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సినిమాలో పని చేసిన అందరూ చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా ఇంత మంచి అవుట్ పుట్ రావడానికి కారణం బెక్కం వేణుగోపాల్ గారు. హీరోయిన్ మేఘలేఖ చక్కగా నటించడమే కాకుండా మా పరిస్థితి అర్ధం చేసుకొని సపోర్ట్ గా నిలిచింది. ఇంద్రజ గారు చాలా సపోర్ట్ చేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమాకి వెళ్ళండి. బిగ్ బాస్ లో వునప్పుడు నా ఒరిజినాలిటీ చూసి ప్రేక్షకులు ప్రోత్సహించారు. బూట్ కట్ బాలరాజుని కూడా అలానే థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారు. చాలా ఫన్ ఎమోషన్ వుంటుంది. ఇందులో చాలా మంచి డ్యాన్స్ కూడా చేశాను. మనం జీవితంలో ఓడిన గెలిచినా ఒక తల్లికి కొడుకు మీద ప్రేమపోదు. అదే ఈ సినిమాలో అద్భుతంగా చూపించాం. ఫిబ్రవరి 2న థియేటర్స్ లో బూట్ కట్ బాలరాజు సినిమా చూడాలని తెలుగు ప్రేక్షలందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను” అన్నారు.