‘లవ్ మీ’ ఆడియెన్స్‌కి నచ్చి పెద్ద హిట్ అవుతుందని

యంగ్ హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోయి‌న్‌గా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా మే 25న రిలీజ్ చేస్తున్నారు. గురువారం నాడు ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్రయూనిట్ మాట్లాడుతూ.. దిల్ రాజు మాట్లాడుతూ.. ‘అరుణ్, నాగ ఈ చిత్రానికి బలం. ఇంత వరకు నేను దర్శకుల్ని పరిచయం చేశాను. మొదటి సారి నాగను నిర్మాతగా పరిచయం చేస్తున్నాను. ట్రైలర్ చూస్తే టీం పడ్డ కష్టం తెలుస్తుంది. ఇది న్యూ ఏజ్ లవ్ స్టోరీ కానుంది. ఆడియెన్స్‌కు నచ్చితేనే సినిమా హిట్ అవుతుంది. మే 25న ఈ సినిమా ప్రేక్షకులను నచ్చి పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. సినిమా టీం అందరికీ థాంక్స్. యంగ్ టీం అంతా కలిసి కొత్త కథతో కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు వస్తున్నారు’ అని అన్నారు. వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. ‘లవ్ మీ ఇఫ్ యు డేర్ ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది. ఇదొక డార్క్ లవ్ స్టోరీ. షాకింగ్ ఎలిమెంట్స్, ప్రేమ, రొమాన్స్, థ్రిల్స్ ఇలా అన్ని అంశాలుంటాయి. పీసీ శ్రీరామ్ గారి విజువల్స్, కీరవాణి గారి మ్యూజిక్, అవినాష్ గారి అద్భుతమైన సెట్స్ అన్నీ ఆశ్చర్యపరుస్తాయి. ఈ మూవీలో డిఫరెంట్‌గా, టఫ్‌గా ఉండే కారెక్టర్‌ను పోషించాను. లోలోపలే బాధపడుతుండే పాత్రను చేశాను. ఆశిష్ కారెక్టర్ ఎంతో మొండిగా ఉంటుంది. ఆయనతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. దర్శకుడు చాలా మంచి డైలాగ్స్ రాశారు. నాపై నమ్మకంతో నాకు పాత్రను ఇచ్చిన దిల్ రాజు గారికి, హర్షిత్, హన్షితకు థాంక్స్. మే 25న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.