మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీ అంటేనే చాలా పెద్ద సర్‌ప్రైజ్. ఇక సినిమా ప్రారంభం అవ్వకుండానే, కనీసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి అయ్యిందా లేదా అనే విషయం తెలియకుండానే ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశానికి తాకేస్తున్నాయి. రాజమౌళి ఏం చేసినా కూడా పర్‌ఫెక్ట్ గా ఉంటుంది. సెట్ ప్రాపర్టీ విషయంలో కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకునే రాజమౌళి ఇక తన సినిమాల హీరోల విషయంలో, వారి లుక్ విషయంలో ఎంతటి జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ బాబును తన సినిమాలో రాజమౌళి ఎలా చూపిస్తాడు అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి కచ్చితంగా ఇప్పటి వరకు మహేష్ బాబును ప్రేక్షకులు చూడని లుక్ లో చూపించబోతున్నాడు. అలాగే పాత్ర విషయంలో కూడా చాలా సర్‌ప్రైజ్ లు ఉండి ఉంటాయి అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు గడ్డం పెంచి కాస్త రగ్గుడ్ లుక్ లోకి మారాడు. కనుక రాజమౌళి సినిమాలో రగ్గుడ్ లుక్ తో మహేష్ బాబు సర్ ప్రైజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అంతే కాకుండా మహేష్ బాబు పాత్ర స్వభావం కూడా చాలా సర్‌ప్రైజింగ్ గా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. మొత్తానికి రాజమౌళి చాలా సర్‌ప్రైజ్ లను ప్లాన్ చేస్తున్నాడని, మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ సినీ ప్రేక్షకులు సర్ ప్రైజ్ ఫీల్ అవ్వడం ఖాయంగా సినీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు. ఈ ఏడాదిలో సినిమా ప్రారంభించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మొదటి నుంచి కూడా ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో సినిమా రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.