అరండల్ పేట శివాలయం లో ఘనంగా మకరజ్యోతి దర్శనం
గుంటూరు అయ్యప్ప సేవా సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక అరండల్ పేట 4/4 శివాలయంలో సమాఖ్య అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ ఆధ్వర్యంలో నేటి సాయంత్రం 6.50 గం. లకు సిరిపురపు స్వరాజ్యలక్ష్మి మకర జ్యోతిని వెలిగించారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధిలో జరిగే మకర విళ్ళక్కు పర్వదినాన్ని పురస్కరించుకొని మకరజ్యోతి దర్శనం కార్యక్రమం నిర్వహిస్తారు.
అలానే గుంటూరు అరండల్ పేట శివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా మకర జ్యోతి దర్శనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తొలుత ఉత్తరా నక్షత్ర దర్శనం తర్వాత జ్యోతి దర్శన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం పూట శ్రీ ధర్మశాస్త హోమ కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమం, సాయంత్రం మకరజ్యోతి కార్యక్రమం స్వామివారికి పలు ఆభరణాలతో విశేష అలంకరణ ,వేద ఘోష నడుమ శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు, భజన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సిరిపురపు శ్రీధర్,ఆలయ ప్రధాన అర్చకులు కుందుర్తి భాస్కర్ శర్మ , సుబ్రహ్మణ్యం ,ఏకా ప్రసాద్, మన్నవ రాధాకృష్ణ , డి.యస్.బాబు,ధనేకుల మోహన్ రావు ,అట్ల జయభారత్ రెడ్డి మేళపూడి కరుణానిధి, యండపల్లి శబరి, కొరియర్ సురేష్, డప్పు నాగేశ్వరరావు, అనీషా, శ్రీలక్ష్మి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.